బంగారంపై రుణం తీసుకునే వారికి బిగ్ అలర్ట్.. వచ్చే బడ్జెట్లో కీలక మార్పులు.. అప్పటి దాకా ఆగండి..

By Borra Hazarathaiah

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బంగారు రుణాలు తీసుకున్న వారు లేదా త్వరలో తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం పొందాలని భావిస్తున్న వారికి ఈ బడ్జెట్ కీలకంగా మారే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా బంగారు రుణాలు భారతీయ కుటుంబాల్లో వేగంగా ప్రాచుర్యం పొందాయి. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల విద్య, వ్యవసాయ అవసరాలు, చిన్న వ్యాపారాల నిర్వహణ వంటి సందర్భాల్లో Gold ఒక నమ్మకమైన ఆర్థిక భరోసాగా మారింది.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. బంగారు రుణ రంగానికి చెందిన సంస్థలు బడ్జెట్ 2026లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) బ్యాంకులకు లభిస్తున్న ప్రయోజనాలు తమకూ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. బంగారు రుణాలు తీసుకునే వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారే. వీరిలో చాలామంది రూ.50 వేల లోపే రుణాలు తీసుకుంటూ, వాటిని అత్యవసర అవసరాలకు వినియోగిస్తున్నారు.


Union Budget 2026 Budget 2026 gold loan gold loan rules change gold loan new regulations Modi government budget 2026 gold loan borrowers India RBI gold loan norms gold loan interest rates gold loan policy update gold loan before budget finance ministry gold loan gold loan restrictions India gold loan news 2026 gold loan impact budget personal finance India budget 2026 2026 2026 2026

ప్రస్తుతం బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలు (Priority Sector Lending - PSL) కింద కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాయి. దీనివల్ల వారికి తక్కువ ఖర్చుతో నిధులు లభిస్తాయి. కానీ బంగారు రుణాలను విస్తృతంగా అందిస్తున్న NBFCలకు ఈ సౌకర్యం లేదు. ఫలితంగా అవి మార్కెట్ నుంచి అధిక వడ్డీ రేట్లకే నిధులను సమీకరించాల్సి వస్తోంది. ఈ అదనపు భారం చివరకు వినియోగదారులపైనే పడుతోంది. అందుకే NBFCలు పంపిణీ చేసే బంగారు రుణాలకు కూడా ప్రాధాన్యతా రంగ హోదా ఇవ్వాలని పరిశ్రమ కోరుతోంది. బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే.. NBFCల నిధుల వ్యయం తగ్గి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే బంగారు రుణాలు అందే అవకాశం ఉంది.

వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. జనవరి 17, శనివారం ధరలు ఇవే..

ఇక మరో ముఖ్యమైన అంచనా ఏంటంటే.. UPI ఆధారిత 'గోల్డ్ క్రెడిట్ లైన్' ప్రవేశపెట్టడంపై ఉంది. ఇప్పటికే UPI దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఇదే ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానమైన బంగారు క్రెడిట్ లైన్ వస్తే, వినియోగదారులు తమ బంగారంపై ఆధారపడి రివాల్వింగ్ క్రెడిట్‌ను అవసరమైనప్పుడు తీసుకుని, వీలైనప్పుడు తిరిగి చెల్లించగలుగుతారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి అనధికారిక వడ్డీ వ్యాపారులపై ఆధారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

అదేవిధంగా, బంగారు రుణ సంస్థలు నియంత్రణ పరమైన ఉపశమనాన్ని కూడా ఆశిస్తున్నాయి. ప్రస్తుతం NBFCలపై ఉన్న కఠినమైన ఎక్స్‌పోజర్ పరిమితులను సడలించాలని పరిశ్రమ కోరుతోంది. బంగారు రుణాలు భౌతిక బంగారంతో పూర్తిగా భద్రత కలిగినవిగా ఉండటంతో డిఫాల్ట్ ప్రమాదం తక్కువగా ఉంటుందని సంస్థలు వాదిస్తున్నాయి. అందుకే టైర్-1 మూలధనంలో ఎక్స్‌పోజర్ పరిమితిని 20 శాతం వరకు పెంచాలని అభ్యర్థిస్తున్నాయి. ఈ మార్పు వస్తే.. సంస్థలు నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు మార్కెట్లో లిక్విడిటీ పెరిగి, రుణగ్రహీతలకు మరింత సులభంగా క్రెడిట్ లభించే అవకాశముంది. బడ్జెట్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. బంగారు రుణాలు తీసుకునే ప్రజలు, ఈ రంగంలోని సంస్థలు ప్రభుత్వం ఏ మేరకు ఈ డిమాండ్లకు స్పందిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Credit: Goodreturns

Story first published: Saturday, January 17, 2026, 11:01 [IST]
Desktop Bottom Promotion