Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
తల్లి పొగ తాగితే బిడ్డ పుట్టేది తక్కువ బరువుతోనా?

పొగ తాగే గర్భవతి మహిళలకు, పొగ తాగని మహిళలకు పుట్టే బిడ్డల బరువులో వ్యత్యాసాన్ని తమ రీసెర్చిలో జరగోజా యూనివర్శిటీ రీసెర్చర్లు కనిపెట్టారు. మహిళ కనుక తాను గర్భవతిగా వున్నపుడు పొగ తాగకుండా వుంటే, పుట్టే బిడ్డ సరైన బరువుతో పుడతాడని, అయితే, మహిళ కనుక తాను గర్భవతిగా వున్నపుడు పొగ తాగితే పుట్టే బిడ్డ బరువు తక్కువగా వుంటాడని అధ్యయనం తేల్చింది.
సాధారణ పిల్లల శారీరక కొలతలు కూడా పొగతాగే తల్లుల పిల్లలతో పోలిస్తే అధికంగా వుంటాయట.
పొగ తాగే తల్లుల బిడ్డలు 180 నుండి 230 గ్రాముల బరువుతో వుండి తాగని తల్లుల పిల్లలకంటే కూడా సన్నగా వుంటారు. సుమారుగా వీరి బరువు సగటున 216 గ్రాములు వుంటుంది. అంతేకాదు, వీరి శరీర చర్మంలో ముడుతలు అధికంగా వుంటాయి. అంటే దానికి కారణం వారిలో కొవ్వు కణాలు తక్కువగా వుంటాయని తెలిపారు. అయితే, బరువులో గణనీయమైన మార్పు ఈ రెండు రకాల పిల్లలలో కనపడినప్పటికి, కొవ్వు అధికంగా లేనందువలన, ఈ పిల్లల శారీరక సైజు మాత్రం అధిక వ్యత్యాసం కలదిగా లేదు.
అయితే, గర్భవతి మహిళ రోజుకు ఎన్ని సిగరెట్లు తాగితే తన కడుపులోని బిడ్డకు ఈ పరిస్ధితి ఏర్పడుతుందనేది రీసెర్చర్లు వెల్లడి చేయలేదు. పొగాకు ప్రభావం గర్భవతి ఆరోగ్యంపైనా, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా వుంటుందని, బిడ్డ శారీరక బరువు, సైజులు, పొగ తాగని తల్లుల పిల్లలతో పోలిస్తే మార్పు వుంటుందనేది తాము తమ పరిశోధనలో రుజువు చేశామని స్టడీ నిర్వహించిన గెరాడో రోడ్రిక్స్ తెలిపారు. తెలిపారు.
ఈ పరిశోధనా అంశంగా వీరు షుమారు 37 వారాల గర్భం వున్న మహిలలను పరిశీలించారు. వీరిలో 22 శాతం మంది మహిళలు షుమారుగా రోజుకు 8 సిగరెట్ల వరకు కాల్చారట. కాని గర్భవతులు ఎన్ని సిగరెట్లు కాల్చారనేది అంశం కాదని, సిగరెట్ పొగ లేదా పొగాకు ప్రభావం మహిళ గర్భంలోని పిండానికి తప్పక వుంటుందని తాము నిరూపించామని, గర్భవతి మహిళలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కొరకైనా సరే వారు గర్భవతులుగా వుండే సమయంలో వారికిగల పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలని, లేదంటే, బిడ్డకు పుట్టే సమయంలోనే కాక, బిడ్డ భవిష్యత్తులో కూడా తల్లి తాగిన సిగరెట్ పొగ దుష్పరిణామాలు కనపడతాయని వీరు హెచ్చరించారు.
ఈ స్టడీ ఫలితాలను ఎర్లీ హ్యూమన్ డెవలప్ మెంట్ జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications
