Latest Updates
-
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
బేబీతో అనుబంధం పెంచండి ...ఇలా?

ప్రేమానుబంధం ప్రధానమా?
ప్రేమానురాగాలు బేబీకి ఎంతో అవసరం. ఈ అంశంపై సైంటిస్టులు కోతుల తీరు తెన్నులు కూడా పరిశీలించి బిడ్డలకు తల్లితండ్రుల అవసరం ఎంతైనా వుందని తల్లితండ్రులు బిడ్డ అవసరాలకు స్పందిస్తే, ఆ బిడ్డ సమాజంలో బాగా అభివృధ్ధి చెందుతుందని వారు వెల్లడించారు. చాలామంది పిల్లలు తక్షణమే తమ తల్లితండ్రులతో బంధం భావిస్తారు. అయితే బిడ్డపై తల్లితండ్రులకు విభిన్న అభిప్రాయాలుంటాయి. కొంతమంది మొదటి నిమిషంలో లేదా రోజునే బేబీ పుటుకకు బంధం పెంచుకోగా, మరి కొంతమందికి అధిక సమయం తీసుకుంటుంది. కాని, ఈ బంధం ఏర్పచుకునే ప్రక్రియ కొద్ది నిమిషాలలోనే ఏర్పడుతుంది కాని, దీర్ఘకాలం కాదు. దానికి కొంత సమయం అంటూ వుండదు.
చాలామంది తల్లి తండ్రులకు ప్రేమ బంధం ప్రతిరోజూ శ్రద్ధ చూపుతుంటే ఏర్పడుతుంది.అది ఏర్పడుతోందని కూడా తెలియదు. మీ బేబీ మిమ్మల్ని చూసి నవ్విందంటే చాలు మీరు ఆనందంతో నిండిపోతారు.
ఈ ప్రేమాను బంధం ఎలా ఏర్పడుతుంది?
మొదటి కారణం స్పర్శ...చర్మానికి చర్మం తగలటం. ఇది ఆనందం కలిగించిబేబీ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
రెండవది చూపు - బేబీ కళ్ళు, మీ కళ్ళు కలిస్తే చాలు బంధం ఏర్పడుతుంది. అది ఒక సంభాషణ.
బేబీ మీ ముఖ కవళికలను అనుకరించటానికి ప్రయత్నిస్తుంది.
మూడవది వినికిడి - బేబీలు తమ తల్లి తండ్రుల స్వరధ్వని వినటానికి ఇష్టపడతారు. దానికి స్పందిస్తారు.
బేబీతో బంధం బేబీ పట్ల తీసుకునే జాగ్రత్త మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. బేబీని స్పర్శించటం, జో కొట్టటం, ఊయల ఊపటం, అనురాగం పెంచుతాయి. మీరు మీ పార్టనర్ బేబీని స్పర్శిస్తూండటంతో బిడ్డ సైతం ఆ స్పర్శల వ్యత్యాసాన్ని గమనించగలదు. పాలు పట్టేటపుడు, ఊయలలో వేసేటపుడు, చిన్నగా బేబీకి మసాజ్ చేసేటపుడు, బేబీ అవసరాలు తీర్చేటపుడు బేబీతోగల స్పర్శానందం అనుభవించితీరాలి. అపుడే ఒక గట్టి తల్లి...బిడ్డల బంధం ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications
