Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు కలిగితేనే జంటల జీవితాలకు అర్ధం!

రీసెర్చర్లు మొదటి సారిగా వారి గణాంకాలలో వైవాహిక జంటలు మిగిలిన ఇతరులకంటే కూడా మహదానందంగా వుంటారని అంగీకరించారు. అయితే, డైవోర్స్ తీసుకున్నా లేక భార్యాభర్తలు విడిపోయినా వారంత దుఖ:పరులు కూడా లేరని రీసెర్చి తెలిపింది. పిల్లలు కలిగినంతమాత్రాన వారి జీవితాలు పూర్తిగా సంతృప్తి కరంగా లేదా బంధాలు మరింత మెరుగుగా మార్చకపోయినప్పటికి అసలు వారి బంధానికి తగిన అర్ధం వారి జీవితాలకు ఒక లక్ష్యం చేకూరినట్లేనని రీసెర్చర్లు తెలిపినట్లు డెయిలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.
ఈ హేపినెస్ సర్వేని నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం నిర్వహించింది. ఆర్ధికపర గణాంకాలకంటే కూడా ఓటర్లకు ఏది ప్రాముఖ్యం అనే అంశంపై ఈ సంస్ధ రీసెర్చి చేసింది. ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఈ సర్వేలో నాలుగే నాలుగు ప్రశ్నలుంటాయట. ఈ సర్వే వ్యయం సుమారుగా సంవత్సరానికి 2 మిలియన్ల పౌండ్లుగా వుంటుంది. వివాహాలు చేసుకున్న జంటలు, ఒప్పందాలమేరకు భాగస్వాములైనవారు అత్యధిక సగటు స్ధాయి జీవిత సంతృప్తిని ప్రకటించారట. డైవోర్సు తీసుకున్నవారు లేదా వేరు పడినవారు అతి తక్కువ సగటు రేటింగ్ ఇచ్చారని సర్వే వెల్లడించింది.
సర్వేని సుమారు 80 వేలమంది వ్యక్తులపై చేశారు. 10 అంకెలుకల స్కేలుపై చేసిన సర్వేలో వారి జవాబులు సుమారు 7 వరకు గుణించబడ్డాయి. పిల్లలు లేని తల్లితండ్రులు సైతం పిల్లలు వుంటేనే బాగుంటుందని తమ జీవితాలకు ఒక అర్ధం వుంటుందని చెపుతూ సర్వే స్కేలు గణాంకాలలో పదికి 7.6 వరకు వెల్లడించారు. వీరిని కూడా కలుపుకుంటే పిల్లలపై మక్కువ వుండి తమ జీవితాలకు అర్ధం కలిగి వుంటుందనే జంటలు సుమారు పదిమందిలో 7.9 వరకు తేలారట.



Click it and Unblock the Notifications