For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ చిగుళ్ళ సంరక్షణ ఎలా?

By B N Sharma
|

Baby
నోటిలో చిగుళ్ళ రక్షణ చిన్నతనం నుండి ప్రధానమైనది. మీ బిడ్డకు మొదటి పన్ను ఏర్పడకముందే మీరు అతని చిగుళ్ళ సంరక్షణ, నోటి శుభ్రత మొదలుపెట్టాలి. నోటి సంరక్షణ బాగా ఉంటే అది మీ బిడ్డ నోటిని ఆరోగ్యంగా ఉంచి దంతాలు, దవడలు చక్కగా వచ్చేలా చేస్తుంది. బిడ్డకు దంతాలు రావటానికి ముందుగానే నోటిలోని బాక్టీరియా చిగుళ్ళను పాడు చేస్తుంది.

మరి బేబీ నోటి చిగుళ్ళ పట్ల సంరక్షణ ఎలా వహించాలి ?
నీటిని ఉపయోగించి - బేబీ చిగుళ్ళను రెగ్యులర్ గా నీటితో కడగండి. తడి గుడ్డతో చిగుళ్ళను మెత్తగా తుడవండి. ఈ అలవాటు మీ బిడ్డకు దంతాలు రాకముందే చేయండి. ప్రతి ఆహరం తర్వాత, నిద్రకు ముందు ఈ చర్య చేపట్టండి. తడిగుడ్డకు బదులుగా మీ చేతిని శుభ్రం చేసుకొని బేబీ నోటికి పట్టించి కూడా శుభ్రం చేయవచ్చు. ఈ చర్య మీ బేబీ నోటిని క్రిములు లేకుండా చేస్తుంది.

టూత్ బ్రష్ - బిడ్డకు దంతాలు రావటం మొదలు పెట్టగానే, చిన్నది మెత్తటిది అయిన టూత్ బ్రష్ ఉపయోగించి దానితో శుభ్రం చేయండి. ఈ దశలో టూత్ పేస్ట్ అవసరం ఉండదు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. మెల్లగా చిగుళ్ళు మసాజ్ చేయండి. బిడ్డకు ఏ హాని జరుగకుండా చూడండి. బ్రష్ కొనలు అరిగితే, బ్రష్ మార్చండి. బ్రష్ చేసిన తర్వాత నోటిని బాగా కడగండి.

ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ - దంతాలు బయటకు రాగానే ఏదేని ఒక నాణ్యతగల టూత్ పేస్ట్ వాడకం మొదలుపెట్టండి. అది దంత క్షయాన్ని నిలిపి దంతాల ఎనామిల్ బలపరుస్తుంది. బాక్టీరియా నోటిలో చేరకుండా చేస్తుంది. అధికంగా పేస్ట్ వాడి హాని కలిగించకండి. మీ బిడ్డకు అవసరమైన ఫ్లోరైడ్ కొరకు వైద్యుని సంప్రదించండి.

ఆహారం - బేబీ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, బిడ్డకు ఇచ్చే ఆహారాలు ఆరోగ్యంగా ఉండాలి. స్వీట్లు, జ్యూస్ లు, పాలు వంటివాటితో జాగ్రత్త పాటించండి. నోటిలో పాలతో నిద్రించకుండా చూడండి. అది బాక్టీరియా కలిగిస్తుంది. తీపి లేదా ఏది తినిపించినా ఒకే సారి ఆహారంతో ఇవ్వండి. తరచుగా బిడ్డకు ఈ రకమైన వస్తువులు తినిపించకండి.

అన్నిటికి మించి మీ బిడ్డ దంత సంరక్షణకుగాను వైద్యులవద్దకు తప్పక రెగ్యులర్ గా తీసుకు వెళ్ళండి. చిగుళ్ళు, నోటి ఆరోగ్యం ఈ దశలో కాపాడితే, మీ బిడ్డకు జీవితాంతం మంచి నోటి ఆరోగ్యం, దంతాలు కొనసాగుతాయని గ్రహించండి.దంతాలు మనిషికి ఆరోగ్యకరంగా నిర్వహిస్తే జీవితాంతం బలంగా పటిష్టంగా ఉంటాయి. మనిషి జీవనానికి వివిధ రకాల ఆహారం తినాలి. సహజ దంతాలు మీ ఆరోగ్యాన్ని ఎల్లపుడూ పరిరక్షిస్తాయి. దంతాలు చిన్న తనంలో ఒక సారి ఊడిపోయినప్పటికి మరోమారు వచ్చాయంటే, అవి ఇంక మీకు శాశ్వతంగా ఉంటాయి. వీటి సంరక్షణ ఎంతో ప్రధానం. నోటి ఆరోగ్యం బాగా ఉండాలంటే, పెద్దలైనా చిన్న పిల్లలైనా ప్రతి ఆహారం తర్వాత నోటిని శుభ్రంగా నీటితో కడిగి నోటిలో బాక్టీరియా చేరకుండా ఎప్పటికపుడు రక్షించుకోవాలి.

English summary

How To Care For Baby Gums | ముత్యాలవంటి దంతాల కొరకు....!

Most important of all, make sure you visit a dentist at regular intervals for healthy baby gums and tooth. You should always visit a dentist along with a paediatrician for your child. Regular gum and mouth care habits at this stage paves the way for your child's healthy oral hygiene in future.
Story first published:Monday, July 9, 2012, 15:36 [IST]
Desktop Bottom Promotion