Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
జంటల కలయికలో పంటల ఫలితం!

మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములుంటాయి. అంటే 46 క్రోమోజోములుగా లెక్కించాలి. ఈ 23 జతలలో 22 జతలు ఆటోజోమ్స్ గా చెప్పబడి సెక్స్ కు సంబంధించినవిగా వుండవు. ఇక మిగిలిన 23వ జత అంటే రెండు క్రోమోజోములు సెక్స్ నిర్ధారతకు సంబంధించినవి. ఇవి ‘ఎక్స్' మరియు‘ వై' క్రోమోజోములుగా చెప్పబడి లింగ నిర్ధారిత చేస్తాయి. పురుషుల్లో ‘ఎక్స్' మరియు ‘వై' క్రోమోజోములు గాను, మహిళలలో రెండూ కూడా ‘ఎక్స్' క్రోమోజోములుగాను వుంటాయి.
పురుషుడి వీర్యంలో ‘ఎక్స్' మరియు ‘వై' క్రోమోజోములు రెండు వుంటాయి. కాని మహిళ విడుదల చేసే అండంలో ఒకే రకమైన క్రోమోజోమ్ అంటే...‘ఎక్స్' మాత్రమే వుంటుంది. వీర్యంలో వున్న ‘ఎక్స్' క్రోమోజోం కనుక గుడ్డును ఫలదీకరణ చేస్తే, ఏర్పడే పిండం ఎక్స్ ఎక్స్ అంటే ఆడపిల్ల. వీర్యంలోని ‘వై' క్రోమోజోము అండంలోని ‘ఎక్స్' క్రోమోజోం తో ఫలదీకరణ చేస్తే అది ఎక్స్ వై పిండం అంటే మగ బిడ్డ గా తయారవుతుంది.
లింగ నిర్ధారణ ...భారతీయ చట్టాలు - ఆడపిల్లలను గర్భం లోనే మరణింపజేస్తుండటంతో, మన దేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ మరియు ప్రినేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ ఆఫ్ 1994 అనే చట్టాలు లింగనిర్ధారణ చర్యలు చేయటం చట్టవ్యతిరేకమని చెపుతున్నాయి. కనుక మహిళ గర్భవతి అయిన తర్వాత ఏ బిడ్డ పుడుతుంది? అంటూ జంటలు ఎన్ని రకాలుగా ఆలోచించినా...బిడ్డ పుట్టే వరకు అది ఆడా? లేక మగా అనేది తెలియరావటం లేదు.



Click it and Unblock the Notifications
