Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
బేబీ హెయిర్ కట్ ఇంత స్టైలా?
చాలామంది తల్లితండ్రులు తమ బేబీకి హెయిర్ కట్ అంటే భయపడిపోతారు. అందునా మొదటి సారి హెయిర్ కటింగ్ వారికి బిడ్డకు కూడా ఎంతో బాధ కలిగిస్తుంది. బేబీకి హెయిర్ కట్ అంటే అంత తేలిక కాదు. ఇంటి వద్ద చేయించినా లేక బార్బర్ షాప్ లో చేయించినా ఎన్నో రకాల జాగ్రత్తలు, ట్రిక్కులు ఆచరించాలి. బేబీ ఎదుగుదలలో హెయిర్ కట్ కూడా ఒక సమస్యగానే ఉంటుంది. కాని అవసరంగా భావించాలి. బేబీ అందానికి అద్దం పట్టాలి. మొదటిసారి బేబీకి హెయిర్ కటింగ్ చేయించేటపుడు తల్లి తండ్రులు ఏం చేయాలి?

సరైన సమయం
సాధారణంగా వయసును బట్టి హెయిర్ కటింగ్ ఉండదు. వెంట్రుకల పొడవును బట్టి బేబీకి కటింగ్ చేయించాలి. మీ బేబీ కొత్తగా పుట్టినదైనా సరే లేక ఒక సంవత్సరం వయసుదైనా సరే వెంట్రుకలు పెరిగే స్పీడ్ బట్టి కటింగ్ ఉంటుంది. బేబీ వెంట్రుకలు కనుక బాగా పెరిగి కళ్ళలోకి ముక్కులోకి పడుతూంటే, వెంటనే చేయించాలి. పుట్టినపుడు రింగుల జుట్టు ఉంటే మొదటి కటింగ్ లో అది పోతుంది. ఇంటిలోనా లేక సెలూన్ లో చేయించాలా? అది మీ బిడ్డ స్వభావం బట్టి ఉంటుంది. మీ బిడ్డ బయటవారిని చూసి భయపడేట్లయితే, ఇంటిలోనే మంచిది. అలవాటైన ప్రదేశం వారికి కొంత సౌకర్యం ఇస్తుంది. ఇంటిలో తల్లి తండ్రులలో ఒకరు చేసేస్తే, తనకు హాని కలుగదని అతను నమ్ముతాడు.
బేబీ ఏడ్వకుండా గట్టివాడైతే, బయట మంచి సెలూన్ కు తీసుకు వెళ్ళి హెయిర్ కట్ చేయించండి. దీనివలన పని నాణ్యత ఉంటుంది. సెలూన్ లో ఉండే వస్తువులతో బేబీ మనసు ఏడ్వకుండా మళ్ళించవచ్చు.
బేబీకి ఏ రకంగా కటింగ్ చేయించాలి?
బేబీకి హెయిర్ కటింగ్ అనేది ఫ్యాషన్ కొరకు కాదు. మొదటి సారి పూర్తిగా అతని సౌకర్యం కొరకు. సాధారణంగా మొదటి కటింగ్ పేరెంట్స్ చేస్తు అతనికి తేలికగా ఉంటుంది. తినేందుకు ఏదైనా చేతిలో పెట్టి కటింగ్ చేసేయండి. బేబీ కొంత సమయం కూర్చొనగలగాలి. బేబీ మరీ ఏడిస్తే, కొద్దిపాటి ట్రిమ్మింగ్ చేసి వదిలేయండి.
కొన్ని సంప్రదాయాలలో బేబీకి మొదటి హెయిర్ కట్ పూర్తిగా గుండు చేస్తారు. పుట్టు వెంట్రుకలు పూర్తిగా తీసేస్తారు. ఈ రకంగా గుండు చేస్తే మరల వచ్చే వెంట్రుకలు బలంగా దట్టంగా ఉంటాయని భావిస్తారు.



Click it and Unblock the Notifications