Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
పసిపిల్లల ఏడుపుకు అనేక కారణాలు..?

పొద్దున వేసిన న్యాపీ తడిసిపోతే కానీ మార్చరు కొందరు తల్లులు. కానీ దాని వల్ల చర్మం రాపిడికి గురవుతుంది. తడిసిన చోట తేమతో ఫంగస్ చేరుతుంది. దీనిని గమనించుకొని తరచూ న్యాపీ మార్చాలి.
వస్త్రంతో చేసినవి వాడినప్పుడు, శుభ్రం చేసేటప్పుడు సబ్బులు, ఇతర సాధనాల వల్ల సమస్య ఎదురవకుండా చూసుకోవాలి. తొడిగిన చోట ఎర్రగా కందిపోయినా, చర్మం ఒరుసుకుపోయినట్లున్నా దాన్ని ర్యాష్ గా పరిగణించాలి. వస్త్రాలతో చేసిన వాటిని వేడి నీళ్లల్లో ఉతకాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బుల్ని ఎంచుకోవాలి. ఎండలో ఆరేస్తే క్రిముల సమస్య ఉండదు.
పసి పిల్లలు మూత్రం పోసినప్పుడు వారిక్రిందకు వేసి దుస్తులు, దుప్పట్లు పాడవకుండా డైపర్ ను బిగుతుగా కడుతుంటారు. దానితో ఆ ప్రాంతంలో గాలి చేరక.. పట్టేసినట్లు అవుతుంది. దాంతో ర్యాష్ తప్పదు. న్యాపీ మార్చిన ప్రతిసారి ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తుడవాలి. తడి పూర్తిగా ఆరాక కొద్ది సేపు ఆగి ఆపై మరొకటి వేయాలి. అప్పుడే సమస్యను కొంత వరకు తగ్గించవచ్చు.
న్యాపీలే కాదు, తుడిచే వైప్స్ నూ జాగ్రత్తగా ఎంచుకోవాలి. సౌకర్యంగా ఉంటుందని ప్లాస్టిక్, రబ్బరు ప్యాంట్లు వేయడం ఎక్కువవుతోంది. కానీ వాటి వాడకం మంచిది కాదు. పాపాయికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు న్యాపీల్లో పౌడర్ వేస్తుంటారు కొందరు. కానీ దాని వల్ల వాటిల్లో క్రిములు చేరే సమస్య మొదలవుతుంది.
ఈ సమస్య రెండు మూడు రోజులుగా వేధిస్తున్నా, జ్వరం వస్తున్నా, ర్యాష్ ఇతర భాగాలకూ చేరినా, పొక్కుల్లా వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
