Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
అప్పుడే పుట్టిన పసిబిడ్డకు వెచ్చదనం ఎందుకు...!?
పసిబిడ్డ సంరక్షణలో మొదటి వారం రోజులూ అత్యంత కీలకమైనవని గుర్తించాలి. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? అన్న అవగాహన పెంచుకుని.. పురిటి బిడ్డని.. పుట్టిన మరుక్షణం నుంచీ జాగ్రత్తగా సంరక్షించుకోవటం అవసరం. బిడ్డ పుట్టగానే బట్ట చుట్టిన తర్వాత.. బిడ్డను తల్లి దగ్గరే, తల్లి శరీరం మీదనే ఉంచాలి. ఒకవేళ తల్లికి సిజేరియన్ సర్జరీల వంటివి పూర్తి చెయ్యాల్సి ఉంటే.. అప్పటి వరకూ బిడ్డను వెచ్చగా లైట్ కింద ఉంచి.. అది పూర్తవుతూనే బిడ్డను తల్లి పక్కకు చేర్చాలి. తల్లి 'ప్రకృతి సహజమైన ఇంక్యుబేటర్' అన్న విషయం మర్చిపోవద్దు. తల్లి ఇచ్చే వెచ్చదనం ఎవరూ ఇవ్వలేరు. తల్లీబిడ్డలను వేరు చెయ్యకూడదు.
ఇలా వెచ్చదనంలో పెరిగే బిడ్డల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే తాగిన పాల శక్తి అంతా బిడ్డ తన శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవటానికే ఖర్చయిపోతుంది. దీంతో పెరుగుదలా దెబ్బతింటుంది. కనీసం ఆర్నెల్ల వరకూ బిడ్డలను వెచ్చగా ఉంచటం అవసరం.కొందరు సంప్రదాయంగా పసిబిడ్డలను పాత బట్టలు, దుమ్ము పట్టిన గుడ్డల వంటి వాటిలో చుడుతుంటారు. అవి ఏ బట్టలైనా సరే, శుభ్రంగా ఉతికినవే పసిబిడ్డ కోసం ఉపయోగించాలి.
మన చుట్టూ ఎన్నో కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిడ్డ ఈ సూక్ష్మక్రిముల బారినపడకుండా మనం పూర్తి శుభ్రత, సురక్షిత చర్యలు తీసుకోవాలి. కాన్పు చేసేవారు చేతులు సబ్బుతో రుద్దిరుద్ది కడుక్కోవాలి, గ్లౌజులు వేసుకోవాలి. ఎవరైనా సరే... చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పసిబిడ్డను ఎత్తుకోవాలి. అంతా 'తలో చెయ్యీ వెయ్యటం' కాకుండా.. బిడ్డను ఒకరిద్దరే ఎత్తుకోవటం, పట్టుకోవటం మంచిది.

బిడ్డ పుట్టిన అర గంటలోపే తల్లిపాలు పట్టించటం ప్రారంభించాలి. దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగటం మొదలవుతుంది. అందుకే తల్లిపాలను వ్యాధులు రాకుండా మనం ఇచ్చే 'తొలి టీకా' అంటారు. పుట్టగానే బిడ్డ బరువు చూడటం, టీకాలు ఇవ్వటం తప్పనిసరి
ఆసుపత్రుల్లో కాన్పు చేస్తే మరో ప్రయోజనమేమంటే వైద్యులు- బిడ్డ పుట్టగానే వైద్యులు కండ్లు, ముక్కు, చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం వంటివన్నీ చక్కగా ఉన్నాయా? లేదా? పుట్టుకతో ఏదైనా లోపాలున్నాయా? శ్వాస సరిగా తీసుకుంటోందా? లేదా? గుండె తక్కువ కొట్టుకుంటోందా? ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే కొందరిలో మలద్వారం సరిగా ఉండదు. దాని మీద ఒక పొర ఉంటుంది. దాన్ని గుర్తిస్తే వెంటనే చికిత్స లేదంటే సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.



Click it and Unblock the Notifications
