Latest Updates
-
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.!
నెలలు నిండకుండా పుట్టే బేబీలకు భవిష్యత్తులో సమస్యలే?

వాటిలో ప్రధానంగా వచ్చే మానసిక సమస్యలు పరిశీలిస్తే, బై పోలార్ డిజార్డర్, డిప్రెషన్, సైకోసిస్ వంటివిగా వుంటాయని జనరల్ సైకియాట్రీ ఆర్చివ్ లలో చేసిన ఒక స్టడీ వెల్లడించింది.గర్భవతికి పూర్తి గర్భ సమయం అంటే షుమారు 40 వారాలు వుంటుంది. కాని తాజా పరిశోధనల మేరకు ప్రతి 13 మంది బేబీలలోను ఒకరు నెలలు నిండకుండా ముందే పుట్టేస్తున్నారు. అంటే షుమారుగా 36 వారాలకు ముందే జన్మిస్తున్నారు. వీరిపట్ల వైద్యులు అధిక జాగ్రత్తలు వహించవలసివస్తోంది.
లండన్ లోని కింగ్స్ కాలేజి లోని ఇన్ స్టిట్యూట్ ఆప్ సైకియాట్రీ మరియు స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యలూట్ లలోని పరిశోధకులు స్వీడన్ లో 1973 మరియు 1985 సంవత్సరాల మధ్య పుట్టిన షుమారు1.3 మిలియన్ బేబీల గురించిన రికార్డులు పరిశోధించారు.
ఈ రికార్డుల మేరకు వారు 10, 523 మంది సైకియాట్రిక్ సమస్యలతో హాస్పిటల్ లో ప్రవేశం పొందినట్లు, వారిలో 580 మంది ముందుగా పుట్టిన వారుగా గుర్తించారు. అయితే, పూర్తిగా నెలలు నిండి పుట్టినవారలో వేయి మందిలో ఇద్దరికి మాత్రమే మానసిక సమస్యలు వున్నట్లు ముందుగా పుట్టిన బేబీలలో అంటే 32 వారాలనుండి 36 వారాలలోపు పుట్టిన వారిలో ప్రతి వేయిమందికి షుమారు 6 గురికి మానసిక సమస్యలు వున్నట్లు కనుగొన్నారు.
డిప్రెషన్ వంటి వ్యాధులు ఈ నెలలు నిండకనే పుట్టిన బేబీలలో ఏడు రెట్లు బై పోలార్ డిజార్డర్ వ్యాధి షుమారు మూడు రెట్లు అధికంగాను వున్నట్లు తెలిపారు.కొద్దిగా మానసిక వైకల్యం వున్న వారు హాస్పిటల్స్ కు రాకపోవటం జరిగి వుంటుందని, ఇవి కూడా లెక్కిస్తే, సమస్యల సంఖ్య మరింత పెరిగి వుండేదని రీసెర్చర్లు తెలిపారు.
అయితే, నేడు ఎప్పటికపుడు వస్తున్న ఆధునిక వైద్య విధానాల కారణంగా పిల్లలు నెలలు నిండకనే ముందుగా పుట్టినప్పటికి ఆరోగ్య సమస్యలు తక్కువగానే వుంటున్నాయని అయితే, వీరు భవిష్యత్తులో వారు పెద్దవారైన తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తోందని రీసెర్చర్లు తెలిపారు.



Click it and Unblock the Notifications
