Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
బిడ్డకు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి?!

పిల్లల అవసరాల మేరకే తయారు చేసిన మసాజ్ నూనెలు మార్కెట్ లో లభ్యమవుతాయి. అది పిల్లల పరిపూర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. మసాజ్ చేయించే సమయంలో పిల్లలకి బట్టలు మార్చేటపుడు గది తలుపులు, కిటికీలు మూసి వుంచడం మంచిది. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగినంత ఉష్ణోగ్రత అవసరం. దీనికోసం రూమ్ హీటర్ పెట్టుకోవచ్చు.
మసాజ్ చేయించేటపుడు మరే ఇతర పనులు పెట్టుకోవద్దు. టీవీ చూస్తూ లేదా కబుర్లు చెపుతూ ఉంటే చేసే మసాజ్ పై మీరు పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. హడావుడి పడకుండా స్ధిమితంగా చేతి మునివేళ్ళతో మెత్తగా మసాజ్ చేయాలి. తర్వాత ప్రశాంత వాతావరణంలో ఊయలలో వేసి ప్రేమగా జోలపాట పాడితే పిల్లలు చాలా సేపు హాయిగా నిద్రపోతారు. తల్లితండ్రులు పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా అవసరమని గ్రహించాలి. ప్రతి రోజూ మసాజ్ కు సమయం కేటాయించలేకున్నా, కనీసం వారానికొకసారి పిల్లలకు మసాజ్ చేస్తూండాలి.
మసాజ్ స్నానం చేయించేటపుడు మీ చేతి గాజులు, వాచీ లేదా ఉంగరాలు, మెడలో గొలుసు వంటివి తీసేయండి. అవి గుచ్చుకుంటే పిల్లలు ఏడుస్తారు. కారణం తెలియక మనకు ఆందోళన కలుగుతుంది. పిల్లలకు మృదువుగా, మెత్తగా మసాజ్ చేస్తే చిరాకు లేకుండా సహకరిస్తారు. మెడపైన, పొట్టపైన సున్నితంగా రుద్దుతూ మసాజ్ చేస్తే పిల్లలు పేచీ పెట్టరు. పని సులువవుతుంది. వంటికి రాసిన నూనె పూర్తిగా శరీరానికి ఇంకేటంతవరకు సున్నితంగా పొట్ట, కాళ్ళు, చేతులు రుద్దండి. ఆపై బిడ్డ భరించగలిగిన మేరకు వేడిగల నీటిని వాడి స్నానం చేయించండి.



Click it and Unblock the Notifications
