Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డలో పొట్ట నొప్పి నివారణ ఎలా?

పిల్లలలో పొట్టనొప్పి నివారణకు సహజ మార్గాలు -
ముందుగా బేబీకి గ్యాస్ కారణంగా వచ్చిందా అనేది పరిశీలించండి. గ్యాస్ కారణం అయితే, పాలిచ్చే తల్లులు మెంతులను తినరాదు. మెంతులతో తయారు చేసిన వంటకాలను కూడా తినరాదు.
బేబీ కనుక బాగా ఏడుస్తుంటే, బేబీకి అపానవాయువు లేదా త్రేన్పు కలిగేలా చేయండి. పొట్ట భాగం మసాజ్ చేయండి. త్రేన్పు, లేదా అపానవాయువు ల రూపంలో గ్యాస్ బయటకు వెళుతుందేమో పరిశీలించండి. పొట్టనొప్పికి కారణం, పొట్టలో గ్యాస్ ఏర్పడటమే.
బేబీకి వేడి నీటి స్నానం చేయించండి. వేడి లేదా గోరు వెచ్చని నీరు పొట్ట నొప్పిని తగ్గించటానికి బాగా తోడ్పడుతుంది. ఆ వేడినీరు బేబీ పొట్టకు తగిలేలా తొట్టి స్నానం చేయించండి. బిడ్డను స్నానం చేయించేటపుడు జాగ్రత్తగా వుండండి. బేబీ పొట్ట అయిదు లేదా ఆరు నిమిషాలు మాత్రమే సౌకర్యం భావిస్తూ వేడి నీటిలో వుండాలి. వేడి వస్తువులు శరీర నొప్పిని పీల్చేస్తాయి. కాని వారికి పెట్టే వేడి నీరు వేడి అధికం లేకుండా చూడండి. గోరు వెచ్చగా వుంటే, పొట్ట నొప్పి తగ్గుతుంది.
పిల్లలకు పొట్ట నొప్పి వచ్చినపుడు సాధారణంగా గ్రైప్ వాటర్ వాడుతూంటాము. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి లేకపోయినప్పటికి ఒక సారి వైద్యులను సంప్రదించటం కూడా మంచిది. బేబీకి గోరువెచ్చటి నీటిని ఇవ్వండి. బేబీ బాటిల్ లో గోరు వెచ్చటి నీరు పోసి పట్టండి. బేబీకి పట్టేటపుడు ముందుగా వేడిని మీ అరచేతితో పరిశీలించండి. గోరు వెచ్చని నీరు పిల్లలకు పొట్ట నొప్పి తగ్గిస్తుంది.
బేబీకి సున్నితమైన మసాజ్ ఇవ్వండి. బేబీని వెల్లకిలా పడుకోబెట్టండి. ఆలివ్ లేదా బేబీ ఆయిలో తో బేబీకి మసాజ్ చేయండి. శరీరం పొట్ట భాగంపై ఒత్తిడి సున్నితంగా చేయండి. వీపుపైన కూడా సున్నితంగా మర్దన చేస్తూ, బేబీకి హాయి గొలిపేలా చేయండి. ఈ కొద్ది మార్గాలతో బేబీలలో పొట్టనొప్పిని అరికట్టవచ్చు. బేబీ కనుక ఏడ్వటం ఇంకా ఆపకపోతే, తక్షణమే వైద్యులను సంప్రదించండి.



Click it and Unblock the Notifications