For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీ...చీ....ఇక ఏడుపు ఆపేయమ్మా...?

By B N Sharma
|

Tips To Stop Your Baby From Crying
బేబీలకు తల్లి తండ్రుల ప్రేమ కావాలి. తమపై వారు శ్రధ్ధ చూపుతున్నారా ? లేదా అనేది గమనిస్తారు. పగలు, రాత్రి ఒక బేబీని ఎలా సముదాయించాలనే కష్టం ఒక కొత్త తల్లికి మాత్రమే తెలుస్తుంది. తన శిశువు సంరక్షణలో తల్లికి అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియదు. బేబీల తడి గుడ్డలు మార్చటం, పాలు పట్టటం, వారితో ఆడటం వంటివి ఎన్నో చేసి వారిపట్ల జాగ్రత్తలు తల్లులు తీసుకుంటారు. అయితే, ఒక్కోసారి బేబీ, గుక్కపట్టి ేడుస్తుంది. ఎంత ఊరడించినా ఊరుకోదు. ఏ తల్లి కూడా తన బిడ్డ ఏడ్వటం చూడలేదు. వెంటనే బేబీ ఏడ్పు ఆపటానికి ఎంతో కష్టపడుతుంది. కాని అది ఎలా? ఏడ్చే బేబీని ఊరుకోబెట్టటానికి బేబీ మైండ్ మళ్ళించటానికి దిగువ చిట్కాలు చూడండి.

బొమ్మలు - బేబీని ఆడించేందుకు బొమ్మలు చాలానే పెట్టి వుంటారు. బేబీ ఏడ్పు ఆపాలంటే, కొన్ని బొమ్మలను చూపి మైండ్ మార్చండి. ఏడ్చే బేబీ కళ్ళముందు బొమ్మను తిప్పండి. బేబీలు బొమ్మలంటే కొన్నిసార్లు ఇష్టపడరు. కనుక రెండు లేదా మూడు బొమ్మలు విచిత్రంగా వుండేవాటితో ధ్వని చేయండి.

పెద్దగా పాట పాడండి - బేబీ ఏడ్పు ఆపాలంటే, మీరు పెద్దగా ఆమెకిష్టమైన పాట పాడండి. లేదా ఇతర ధ్వనులు చేయండి. అది బేబీ మూడ్ మారుస్తుంది. లేదా చప్పట్లు కొడుతూ పెద్దగా పాడండి. జోలపాటలు బేబీ ఏడ్పు ఆపేందుకు బాగా పని చేస్తాయి. వీటిని తప్పక నేర్చుకోండి.

బయటకు తీసుకు వెళ్ళండి - బేబీ ఏడుస్తూ వుంటే మూడ్ మార్చటానికి వెంటనే బయటకు తీసుకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలు, లేదా దృశ్యాలు చూస్తే బేబీ సెకండ్లలో ఏడ్పు ఆపేస్తుంది. కొత్త ముఖాలు, ప్రదేశాలు బేబీకి తక్షణ ఆనందం కలిగిస్తాయి.

ఇతర చర్యలు - బేబీ ఏడ్పు ఆపాలంటే ఆమె మైండ్ మళ్ళించాలి. రంగురంగుల ఆక్వేరియం చేపలను చూపండి. గిన్నెలు చప్పుడు చేయండి. లేదా టెలివిజన్ పెట్టండి. ఈ పనులు చేస్తే బేబీ వెంటనే ఏడ్పు ఆపేస్తుంది. టి.వి. పెట్టేటపుడు బేబీ కళ్ళకు దానిని దూరంగా వుంచండి. అయితే, ఛానెల్స్ మార్చి కూడా చూపండి. త్వరగా ఏడ్పు ఆపేస్తుంది.

ఆహారం - కొన్ని సార్లు బేబీ బోర్ కొట్టేసి కూడా ఏడుస్తుంది లేదా ఆకలి వేసి కూడా ఏడుస్తుంది. కనుక మీరు అది కనిపెట్టాలి. అటువంటపుడు ఊయల లేదా మీ చేతులలో వుంచి పాలు పట్టండి. బేబీ తిరస్కరిస్తే బేబీని ఇల్లంతా తిప్పుతూ ఆనందపరచేలా చేసి ఊరుకోపెట్టండి.

చిన్ని చిన్ని ఈ చిట్కాలతో బేబీ ఏడ్పు ఆపేయవచ్చు.

English summary

Tips To Stop Your Baby From Crying | బేబీ ఏడుపు ఆపాలంటే ఎలా?

Feed: Sometimes, the baby starts crying due to boredom but, most of the times, the young one cries when hungry. It is a sign to tell that he/she is hungry. Breastfeed the baby by cradling him or her in your arms. If the baby rejects to drink, roam around with him/her and make some pleasing sounds to soothe the restless baby.
Story first published:Wednesday, May 16, 2012, 12:17 [IST]
Desktop Bottom Promotion