Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
బిడ్డపుట్టిన వెంటనే వైద్య పరీక్షలు ఎలా వుంటాయి?

బేబీ కడుపులో కాళ్ళు, చేతులు ముడుకుకొని చాలా కాలం కూర్చున్నందున అవి వంగిపోయి వుంటాయి. కొద్ది నెలలు గడిస్తే కాని ఇవి సాధారణస్ధితికి రావు. బేబీ పెరుగుతున్న కొలది కాళ్ళు చేతులు తిన్నగా వస్తాయి. బేబీ చిన్న వేళ్ళు, కాలి వేళ్లు చూడండి. అవి చాలా పలుచగా వుంటాయి. పొడవుగా వుండే గోళ్ళు వుంటాయి.
బేబీ చర్మం అనేక రకాలుగా కనపడుతుంది. ఎర్రగా, పింక్ రంగులో లేదా ఊదా రంగులో మొదట వుంటుంది. కొంతమంది బేబీలు తెలుపురంగుతో పుడతారు. ఈ తెలుపురంగు వారి చర్మాన్ని తల్లి గర్భ సంచిలో వున్న ఉమ్మ నీటినుండి కాపాడుతూంటుంది. దీనినే వర్నిక్స్ అంటారు. బేబీని మొదట స్నానం చేయించిన వెంటనే ఈ వర్నిక్స్ మాయమవుతుంది. మరి కొంతమంది బేబీలు ముడతలతోపుడతారు. కొంతమంది అంటే ప్రత్యేకంగా నెలలు నిండకుండా పుట్టిన బేబీలు ఎంతో సున్నితంగా చిన్నపాటి వెంట్రుకలతో పుడతారు. ఒకటి లేదా రెండు వారాలలో వెంట్రుకలు ఊడి వచ్చేస్తాయి.
కొత్తగా పుట్టిన శిశువులలో ర్యాషెస్, మచ్చలు లేదా చిన్న తెల్లటి మచ్చల వంటివి సాధారణం. ఇవన్ని కూడా పుట్టిన కొద్ది రోజులు లేదా వారాలవరకు మాత్రం వుంటాయి. మీ బేబీని డాక్టర్ పుట్టినప్పటినుండి మొదటి 12 నుండి 24 గంటలలోనే పరీక్షించి అవి సాధారణ మచ్చలా కాదా అనేది పరిశీలిస్తాడు. మీ బేబీ ఆకారం పుట్టిన కొద్ది వారాలకే పెరుగుదల చూపి మీరు ఆశించని రీతిలో రూపం మారిపోతుందని గుర్తుంచుకోండి. కాళ్ళు చేతులు సాగుతాయి. చర్మం రంగు మారుతుంది. మచ్చలవంటివి పోతాయి.
బిడ్డ పుట్టిన వెంటనే మీ బేబీ ని ఆరోగ్యం కొరకు పరీక్షలు చేస్తారు. రొటీన్ గా చేసే ఈ పరీక్ష లో బేబీ ఎలా స్పందిస్తోంది? ప్రధాన గుర్తులేమిటి అనేది తెలుస్తుంది. అయిదు అంశాలు పరీక్షిస్తారు. అవి గుండె కొట్టుకోవడం, శ్వాస, రంగు, శరీరంలోని కండరాల కదలికలు, ముఖం చిట్లింపు, నోరు వెక్కిరింపు వంటివి పరిశీలిస్తారు.



Click it and Unblock the Notifications
