For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నడక నేర్చిన పిల్లలను చనుబాలు తాగడం మాన్పించడం ఎలా ?

|

సాధారణంగా, ఓ పసిపిల్లవాడు తప్పటడుగులు వేసేటప్పటికే అతని తల్లి చాలా సార్లు చనుబాలు తాగడం మాన్పించాలని అనుకుంటూ వుంటుంది. బహుశా ఒకటి కన్నా ఎక్కువసార్లు విఫలయత్నం కూడా చేసి వుంటు౦ది. చాలా సార్లు రొమ్ము నుంచి పసిపిల్లలను దూరం చేయడం తేలిక కాదు, కానీ తప్పటడుగులు వేసే పిల్లవాడిని మాన్పించడం మరింత కష్టమైన ప్రక్రియ. ఐతే, కొన్ని సరళమైన పనులు చేసి, కొంత ప్రయత్నం, ఓపికతో మీరు తప్పటడుగులు వేసే చిన్నారిని చనుబాలకు దూరం చేయవచ్చు.

చర్యలు :

1. మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి

చనుబాలు మాన్పించేటప్పుడు ఏమేమి ఊహించాలో తెలుసుకోవడంతో మొదలు పెట్టడం. ఈ మాన్పించే ప్రక్రియ జరిగేటప్పుడు మీ శరీరం గురించి ఏమి తెలుసుకోవాలో నేర్చుకోండి. సహజంగా కొన్ని మార్పులు జరుగుతాయి - వాటిని బాగా అవగతం చేసుకుంటే అవి సంభవించినప్పుడు పాలు మాన్పిస్తే వచ్చే సహజ ప్రతిక్రియగా మీరు గుర్తించగలుగుతారు.

How to Stop Breastfeeding a Toddler

భావోద్వేగాలలో కొన్ని మార్పులు సహజంగా వస్తాయి. హార్మోన్లలో వచ్చే మార్పులు కేవలం శారీరిక లక్షణాలుగా కనపడడమే కాక మీ భావోద్వేగాలను, మూడ్ లను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల మీ పసిపిల్లవాడు కూడా ప్రభావితం అవుతాడని గ్రహించాలి. ఈ సమయంలో అతన్ని సముదాయించడం కూడా చాలా కష్టమౌతుంది. తనకు అర్ధంకాని ఒక బలవంతపు మార్పు ప్రక్రియలో మీ పసివాడున్నాడని అర్ధం చేసుకోండి.

2. మెల్లగా మాన్పించండి

మెల్లిగా, ఒక క్రమ పద్ధతిలో మాన్పించడం మొదలు పెట్టండి. ఇలా మెల్లిగా, క్రమంగా తల్లిపాలు మాన్పించడం, అటు పిల్లవాడికి, ఇటు తల్లికి కూడా మంచిది. హటాత్తుగా తల్లి పాలు మాన్పించడం వాళ్ళ పసివాడి శరీరంలోనూ, తల్లి శరీరంలోనూ కూడా చాలా బాధాకరంగా వుంటుంది - పైగా తల్లిలో రొమ్ము వాహిక బిగబట్టినట్టుగా అయిపోయి వాపు గానీ, లేదా రొమ్ము ఇన్ఫెక్షన్ మాస్టైటిస్ రావచ్చు.

తల్లిపాలు ఇచ్చే వ్యవధి క్రమంగా తగ్గించుకుంటూ రండి. మీ పసివాడికి రోజూ భోజనం తర్వాత పాలు తాగడం అలవాటైతే, ఒక వారం పాటు ఆ సమయానికి పాలు ఇవ్వకండి. తర్వాతి వారం సాయంత్రం పూట మొదటి సారి లేదా రోజూ ఇచ్చే సమయం ఒకదాన్ని తగ్గించండి. ఇలా తల్లిపాలు మానేసేవరకు మీ పసివాడికి అన్ని పాలుపట్టే సమయాలను క్రమంగా తగ్గించుకుంటూ రండి.

3. ట్రిగ్గర్లను రానీయకండి.

మీ చనుబాలను మీ పిల్లవాడు చూడకుండా జాగ్రత్త పడ౦డి. వాడి ముందు బట్టలు మార్చుకోవడం మానేయండి. వాడితో కలిసి స్నానం చేయకండి. మీ వక్షోజాలను చూడగానే వాడికి పాలు తాగాలని గుర్తుకు వచ్చి మళ్ళీ పాలు తాగాలని ప్రయత్నిస్తాడు.

మీ పసివాడిని మరో రకంగా ఎత్తుకోండి. పాలిచ్చేటప్పుడు పట్టుకున్నట్టు ఎత్తుకోకండి. మరోలా పట్టుకోవడం వల్ల వాడికి పాలు తాగాలనే కోరిక నుంఛి దూరం చేయవచ్చు.

వాతావరణ ట్రిగ్గర్లను౦చి దూరంగా ఉండండి. మీ పిల్లవాడికి పాలిచ్చేటప్పుడు కూర్చునే కుర్చీ, గది లోకి వెళ్ళడం తగ్గించండి. మీ పసివాడు పాలు తాగాలని కోరుకునే ట్రిగ్గర్లను తగ్గించడానికి సాధ్యమైనన్ని దినచర్యలను మార్చండి.

4. దృష్టి మళ్ళించే ఉపాయాలు వాడండి.

మీ పసివాడి దృష్టి మళ్ళించండి. పిల్లల దృష్టి మళ్ళించడం తేలిక. మీ పిల్లవాడిని బయటకు తీసుకువెళ్ళి వాడితో నడవండి. వాడికి నచ్చిన పాట పాడండి లేదా ఆహారంతో దృష్టి మళ్ళించండి. మీ పసివాడిని బిజీగా వుంచండి. వాడు బిజీగా వుంటే పాలు తాగడానికి ఏం చేయాలనుకుంటాడో అది మర్చిపోతాడు. పిల్లవాడు పెరిగే కొద్దీ నిద్రపోవడం తగ్గుతుంది. వాడి చుట్టూ వుండే ప్రపంచంలోని వింతలను అన్వేషిస్తూ ఏదైనా సాధించేదాకా చికాకుగా అదే పనిలో నిమగ్నమై పోతాడు. మీ పసివాడు నిద్ర పోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కనుక్కోండి. మామూలుగా నిద్రపుచ్చే బదులు కార్లో శికారో లేదా కారేజ్ లో తిప్పడమో చేస్తే ఫలితం ఉండవచ్చు.

5. ప్రత్యామ్నాయాలు వాడండి.

చనుబాలు తాగే బదులు మీ పసివాడికి రుచికరమైన పానీయాలతో చప్పరించే కప్పులు అలవాటు చేయండి. ఆరోగ్యకరమైనవి రుచిగా కూడా వుంటాయి, కాబట్టి అనారోగ్యకరమైన ప్రత్యామ్నాయాల జోలికి వెళ్ళకండి. మీ పిల్లవాడికి ఇంతవరకు కావలసిన పోషకాలు మీ చనుబాల నుంచే వచ్చాయి కాబట్టి, మాన్పించాలంటే అంతకన్నా అదనపు పోషకాలు కావాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. రొమ్ము బదులు సీసా ఇవ్వండి. చాలాసార్లు చనుబాలకు అలవాటు పడ్డ పిల్లలు సీసా నుంచి తాగారు. నిద్రపోయేటప్పుడు కాకుండా ఇతర సమయాల్లో సీసా ఇవ్వండి. మీ పసివాడు తల్లిపాలు తాగుతూ ఒళ్లో నిద్రపోవడం అలవాటు పడ్డ వాడు కనుక చనుబాల బదులు సీసాను ఇష్టపడడు. దాని బదులు మీ వాడు కేరేజ్ లో షికారుకి వెళ్ళేటప్పుడు లేదా మరో పనిలో బిజీగా వున్నప్పుడు సీసా ఇవ్వండి. దీనివల్ల మీ పిల్లవాడు పెద్దగా ఆలోచించకుండా, తల్లి తనను సముదాయించాలనుకోకుండా సీసాకు అలవాటు పడతాడు.

చనుబాల బదులు ఘనాహారం వాడండి. కడుపు నిండిన పసివాడు తల్లిపాల గురించి ఆలోచించడు. ఆహార ప్రత్యామ్నాయాలు అన్నీ ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోండి, అనారోగ్యకరమైన వాటి జోలికి వెళ్ళకండి.

ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు మీ పిల్లవాడికి అందించండి. రుచికరమైనవి మీ పిల్ల వాడి దృష్టి మరలుస్తాయి, వాటిని మీరు అరలోంచి తీయడం వాడు చూస్తుంటే వెంటనే తేలిగ్గా చనుబాలు తాగాలన్న ఆలోచన మర్చిపోతాడు.

English summary

How to Stop Breastfeeding a Toddler | పసిపిల్లలతో పాలు తాగడం మాన్పించడం ఎలా?

Generally, by the time a baby becomes a toddler, his mom has already thought about weaning her baby several times. Perhaps she has even unsuccessfully attempted to do so more than once.
Desktop Bottom Promotion