Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
చిన్న పిల్లల్లో ఎక్కిళ్ళు తగ్గించేందుకు చక్కటి పరిష్కార మార్గాలు...!
ఎక్కిళ్ళు లేదా వెక్కుళ్ళు(Hiccough) అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా 'హిక్' అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో వెక్కిళ్ళను 'హిక్క' అని, ఆంగ్లంలో 'హిక్కప్' అని అంటారు.
సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. అయితే ఒక్కోసారి చిన్న పిల్లల్లో వచ్చే ఎక్కిళ్ళు తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అయితే చిన్నపిల్లల్లో ఇవి సహజంగా వస్తుంటాయి. అందుకు ఆందోళన పడవల్సిన అవసరం లేదు. అందుకు కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. పసిపిల్లల్లో ఎక్కిళ్ళకు మొదట కారణాలు తెసుకొన్నట్లైతే ఎక్కిళ్ళను పోగొట్టడానికి అతి సులభమైన మార్గాలున్నాయి.
పసిపిల్లల్లో ఎక్కిళ్ళకు కారణాలు: ఎక్కిళ్లు డయాఫ్రం కదలిక వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డయాప్రం ఒక్కసారిగా సంకోచించడము వలన ... గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

పసిపిల్లల్లో ఎక్కిళ్ళను ఎలా నివారించాలి:
ఎక్కిళ్ళను తగ్గించుకోవడానికి పెద్దలైతే రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగడం, హఠాత్తుగా భయపడేట్టు చేయడం మొదలైనవి. అయితే పసిపిల్లల్లో ఇటువంటి చిట్కాలు చేయించడం కష్టతరం. ఆరోగ్యానికే ప్రమాదం. అందుకు మరికొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం:
1. వెన్ను తట్టాలి: నిజానికి చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. లేదా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.
2. బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ మార్చాలి: కొన్ని సార్లు బిడ్డకు పాలు పట్టేటప్పుడు, పాలతో పాటు గాలిని కూడా మింగుతారు. ఇది పిల్లల్లో ఎక్కిళ్ళ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి, మీరు బిట్టకు పాలు పట్టేటప్పుడు తగు మరిమాణంలో అందించాలి. మరియు కూర్చోబెట్టుకొనే లేదా పడుకోబెట్టుకొనే పొజీషన్ సరిగా ఉందో లేదో చూసుకొని పాలు పట్టించాలి.
3. తేంపును తెప్పించాలి: పాలు పట్టిన తర్వాత పసిపిల్లలు త్రేంచడం చాలా అవసరం. పాలు పట్టించిన తర్వాత పిల్లల్ల ఉదర భాగాన్ని అలా మసాజ్ లేదా మర్ధన చేయడం వల్ల తేంపు వస్తుంది. దాంతో కడుపులో చేరి గాలి లేదా గ్యాస్ బయటకు వచ్చేయడం తో ఎక్కిళ్ళు రావు.
4. పిల్లలకు క్రమంగా పాలు పట్టాలి: పసిపిల్లల్లో ఆకలి కలగడానికి ముందే లేదా గ్యాస్ ఉత్పత్తి కావడానికి ముందే పాలు పట్టాలి. క్రమంగా పాలు పట్టడం వల్ల ఎక్కిళ్ళను రాకుండా అడ్డుకోవచ్చు. కొన్ని సందర్బాల్లో వచ్చే ఎక్కిళ్ళకు గ్యాస్ సమస్య కూడా కావచ్చు. ఒక్క సారి ఎక్కిళ్ళు గ్యాస్ట్రిక్ సమస్యలను సూచిస్తుంది. అటువంటప్పుడు పిల్లల్లో వాంతులతో కూడిన ఎక్కిళ్ళు మొదలవుతాయి.
5. ఎక్కిళ్ళు నిలపకుండా అలాగే వస్తుంటే పాలు పట్టడం ఆపాలి: కొద్దినిముషాల తర్వాత కూడా ఎక్కిళ్ళు ఆపకుండా అలాగే వస్తుంటే, బేబీకి ఫీడ్ చేయడం ఆపాలు. అలాగే పాలు పట్టడం వల్ల పిల్లలు వాంతి చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కిళ్ళు నిలిచేంత వరకూ ఉండి. ఆ తర్వాత పాలు పట్టడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications