Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
చిన్న పిల్లలకు 7 అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు
ఒక విజయవంతమైన తల్లిగా మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త మరియు ప్రేమగా చూసుకోవటం అనేది అంత సులభం కాదు. ముఖ్యంగా మీరు ఒక కొత్త తల్లి మరియు మీ మొదటి బిడ్డ పుట్టిన సమయంలో మీకు మాతృత్వం మీద అనుభవం మరియు జ్ఞానం లేకపోవడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలలో ఆహార సమస్య ఒకటి. అందువలన మీరు మీ శిశువు కోసం ప్రమాదకరమైన ఆహారాల గురించి తెలుసుకోవాలి.
కొన్ని ఆహారాల వలన అలెర్జీలు మరియు ఊపిరి ఆడకపోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయి. మీ పిల్లలకు 4-6 నెలల వయసు వచ్చేవరకు ఘనా ఆహారాలు ఇవ్వడం నివారించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు చాలా తరచుగా శిశువు ఆహారం మీద వారికీ ఉన్న టెంప్టేషన్ నిరోధించలేరు.
మీరు ఆరోగ్యకరమైన మరియు సురక్షితంగా ఉండే ఆహారాలను కనుగొనేందుకు సహనం ఉండాలి. క్రింద ఉన్న పిల్లలకు ప్రమాదకరమైన ఆహారాల గురించి తెలుసుకుంటే మీకు అవాంఛనీయ వ్యాధులు మరియు రోగములు నుండి మీ పిల్లలను నిరోధించడానికి సహాయం చేస్తుంది.

ఆవు పాలు
మీ పిల్లల వయస్సు 1 సంవత్సరం లోపు ఉంటే మీరు మీ పిల్లలకు ఆవు పాలు ఇవ్వవలసిన అవసరం లేదని గుర్తుంచుకోవటం ముఖ్యం. మీ చిన్న పిల్లలకు రొమ్ము పాలు అనేవి ఒక ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. మీ పిల్లలకు ఆవు పాలు వాడకుండా ఉండటానికి కొన్ని ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆవు పాలలో ఇనుము తక్కువగా ఉండుట వలన ఇనుము లోపంనకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆవు పాలలో విటమిన్లు C,E మరియు జింక్ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. ఆవు పాలు శోషణ కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ. కొన్ని జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉండుట వలన ఆవు పాలు చిన్న పిల్లలకు మంచిది కాదు. ఖచ్చితంగా,ఆవు పాలు పెద్దలకు ఆరోగ్యకరమైనవి. కానీ పిల్లల కోసం సురక్షితం కాదు. ఎందుకంటే మీ పిల్లల మూత్రపిండాలు మీద తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.

నట్స్
మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నట్స్ నిషేధించాలి.ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఊపిరి ఆడకపోవడంతో ముప్పు కలుగుతుంది. కానీ నట్స్ ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా గింజ బట్టర్స్ కూడా ఉండవచ్చు. అలాగే వాటి నిర్మాణం మందంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఈ నట్స్ వలన అనేక రకాల అలెర్జీలను ఎదుర్కొంటున్నారు. అలాగే మీ శిశువు కూడా ఒక మినహాయింపు కాదు. మీరు మీ పిల్లలకు నట్స్ ఇవ్వటానికి ముందు అలెర్జీ ప్రమాదం గురించి తెలుసుకోవాలి. అలాగే ఒక శిశువైద్యుడు సలహా కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.

చేప
సాదారణంగా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇవ్వటానికి భయపడే ఆహారాలలో చేప ఒకటి. ఎందుకు అది వారికి అపాయకరం? నేను మీకు ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలను చెప్పుతాను. చేపలో ఉండే పాదరసం శరీరం యొక్క పెరుగుదలను నిరోధించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు కింగ్ మార్సెల్ మరియు స్వోర్డ్ ఫిష్ వంటి చేపల రకాలతో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాటిలో పాదరసం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వివిధ రకాల చేపల వల్ల అలెర్జీలు వస్తాయి. మీ పిల్లల వయస్సు 2-3 సంవత్సరాలు ఉంటే అప్పుడు మీరు ఉడికించిన చేపలను పెట్టటం మంచిది. ఈ విధంగా మీరు అలెర్జీ ప్రతిచర్యలు నుండి మీ పిల్లలను రక్షించుకోవచ్చు. మీ పిల్లల కోసం చాలా ప్రమాదకరమైన ఆహారాలలో చేప ఒకటని భావించవచ్చు.

గుడ్లు
బహుశా ఇది మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఇది నిజమే. గుడ్లు కూడా మీ పిల్లల ఆరోగ్యానికి హానికరము చేయవచ్చు. సాధారణంగా యువ తల్లులు మాత్రం పిల్లలకు గుడ్లు పడవని గుర్తుపెట్టుకోవాలి. కానీ నిరాశ లేదు. సాధారణంగా పిల్లలు పెరగటానికి ముందు అలెర్జీ లు బహిర్గతం కావు. 5 సంవత్సరాల వయసులో ఉన్న మీ పిల్లలకు వారి ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేకుండా గుడ్లు తినడానికి ఇవ్వవచ్చు. ప్రతి తల్లి ఖచ్చితంగా తెలుసుకోవాలసిన విషయం ఏమిటంటే గుడ్లలో అలెర్జీ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఈ అలెర్జీ లక్షణాల వలన వేగవంతమైన గుండెచప్పుడు,ఎర్రబారడం,శ్వాస సమస్యలు ఉంటాయి. అయితే,మీరు మీ స్వంత అనుభవం మరియు సహజ సామర్థ్యం మీద ఆధారపడకూడదు. ఒక డాక్టర్ ను సందర్శించడం ఉత్తమం.

పిల్లలకు ఊపిరి ఆడకుండా చేసే ఆహారాలు
ప్రతి ఒక్కరూ అనేక విటమిన్లు,పోషకాలు కలిగిన తాజా పళ్ళు మరియు కూరగాయలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తారు. కానీ పెద్దలకు మాత్రమే ఉపయోగకరముగా ఉంటుంది. మీరు మీ పిల్లలకు పచ్చి కూరగాయలను ఇవ్వాలని ఉంటే,అవి అపాయం కలిగిస్తాయని తెలుసుకోవాలి. ముందుగా పిల్లలకు పండ్లు మరియు కూరగాయలు నమలటం అనేది హార్డ్ మరియు కష్టంగా ఉంటుంది. అందువలన పిల్లలకు ఊపిరి ఆడకుండా చేసే ప్రమాదం ఉంది. మీ శిశువుకు భారీ ఆహారాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టటం మంచిది. పండ్లు మరియు కూరగాయలు చుట్టూ ఎక్కువ ఆందోళనలు ఉన్నాయి. నా స్నేహితుడికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కానీ ఆమె ఇంకా ఊపిరి ఆడకుండా చేసే ఆహారాలను తగ్గించి పెడుతుంది.

తేనె
తేనె వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కాదనలేనిది నిజం. మనం తేనెను తీసుకుంటే మన శరీరంనకు అనేక విటమిన్లు మరియు పోషకాలు అందుతాయి. అంతేకాకుండా తేనె చిన్న పిల్లలకు గొంతు నొప్పులకు మొదటి పరిహారంగా ఉందని తెలుసు. బహుశా మీకు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మీ శిశువు ఆహారంలో తేనె వంటి ఉత్పత్తులను తొలగించటం ఉత్తమం. ఇది కనీసం 1 సంవత్సరం తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. పిల్లలకు తేనె హానికరం ఎందుకు? దాని గురించి చాలా భయంకరమైన విష పూరిత అభివృద్ధి భయం ఉంది. ఎందుకంటే తేనెలో ప్రత్యేక బ్యాక్టీరియా నిర్మాణమును చూడొచ్చు. తేనె తీసుకొనే ప్రతి బిడ్డ ఈ వ్యాధిని పొందుతారని కాదు. అయితే ఇప్పటికీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ పిల్లలు తేనే గల ఆహారాలను ఇష్టపడితే,అప్పుడు మీరు మీ పిల్లలకు ఇచ్చే ఆహారాలలో కొంచెం తేనే కలపవచ్చు. తేనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే ప్రమాదకరము ఉండదు. కాబట్టి మీరు ఏ హానికరమైన బాక్టీరియా మీ కిడ్ యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చేయకుండా చూసుకోవాలి.

కెఫిన్ ఉన్న పానీయాలు
నేను కెఫిన్ మన శరీరంనకు అవసరం లేదని భావిస్తాను. నిజానికి,మనం కెఫిన్ లేకుండా కూడా పని చేయవచ్చు. కెఫిన్ తినటం వలన మన శరీరంనకు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందించలేదు. ఇది ప్రత్యేకంగా మా ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆరోగ్యంపై ప్రభావితం ఉండదు. మీ శిశువు కెఫిన్ కలిగిన ఏదైనా పానీయంను త్రాగితే ఖచ్చితమైన దుష్ప్రభావాలు ఉన్నాయి. దీని ఫలితంగా మీ పిల్లలకు వికారం మరియు నిద్రలేమి కలుగుతుంది.
చివరగా,నేను మీరు మీ పిల్లలకు ఘన ఆహారాలు పెట్టే ముందు తప్పనిసరిగా శిశువైద్యుడిని సంప్రదించటం ముఖ్యం. ఒక డాక్టర్ స్వభావాన్ని అర్ధం చేసుకొని మొత్తం వివరాలు చెప్పుతారు. అప్పుడు మీకు ఖచ్చితంగా ప్రయోజనకరమైన ఆహారాలు మరియు నివారించవలసిన ఆహారాల గురించి తప్పనిసరిగా తెలుస్తుంది. మీరు చిన్న పిల్లలకు సురక్షితం కాని ఆహారంనకు సంబంధించిన ఇతర ఆలోచనలు ఉంటే మాకు తెలియజేయవచ్చు.



Click it and Unblock the Notifications











