Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 5 చిట్కాలు
ర్భం ధరించటం తేలిక కావచ్చు. కానీ కొంతమంది మహిళలకు అది చాలా కష్టం. అనేక కారణాలుంటాయి. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి సమస్యా లేకుండా గర్భం దాల్చడం అరుదుగా జరుగుతోంది. మారుతున్న కాలంతో పాటు, జీవన శైలిలో అనేక రకాల మార్పులు, ఆహారంలో మార్పులు, విశ్రాంతి లేకుండుట, అల్ప నిద్ర, ఒత్తిడి ఇవన్నీ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతోంది. సమాజంలో ప్రతి 6 నుండి 10 జంటలను గమనించినట్లైతే వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్త్రీలలో వంధ్యత్వ (పిల్లలు పుట్టకుండుట)లక్షణాలు ఒత్తిడితో ఏర్పడుతున్నవే. అయితే మరికొందరిలో కొన్ని పెద్ద సమస్యలు, కొన్ని చిన్న సమస్యలున్నా పిల్లలు కలగకపోవడానికి కారణం అవుతున్నాయి.
గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న...! వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భదారణ గురించి తెలుసుకోవడమే. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే గర్భాధారణ ఏర్పడటానికి అండం ఆరోగ్యం గా ఉండాలి. అండం ఆరోగ్యంగా విడుదల కావడానికి కొన్ని ప్రత్యేకమై ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అతి త్వరగా గర్భం ధాల్చడానికి అవకాశం ఉంది... మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా...

ఫెర్టిలిటీ డేస్: అండం ఎప్పుడు విడుదలవుతుందనే విషయం ఖచ్చితంగా తెలిసుండాలి. గర్భంధరించాలనుకొనే ప్రతి మహిళా తన ఓవులేషన్ టైమ్ తెలుసుకొన్నట్లైతే ఆ సమయంలో కన్వీన్స్ అవ్వడానికి సులభం అవుతుంది. రెగ్యులర్ గా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ డేట్స్ ను క్యాలెండర్ లో మూడు నెలల పాటు క్రమంగా గుర్తించాలి.దాంతో అండం విడుల అయ్యే సమయ్యాన్ని ఖచ్చితంగా కనుక్కోగలరు. దాంతో ఆ సమయంలో పార్టర్న్ ఇద్దరు సన్నిహితంగా ఉండటంవల్ల త్వరగా గర్భాదరణ కలిగే అవకాశం ఉంది.

ఆహారపు అలవాట్లలో మార్పలు: మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొన్నట్లైతే ఫెర్టిలిటీకు సులభం అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సహాయపడే ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ ను అధికంగా తీసుకోవాలి. ఫెర్టిలిటీకి ఉపయోగపడే ఆహారాలు చాలా ఉన్నాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ మరియు యాంటిఆక్సిడెంట్స్ , ఫోలిక్ యాసిడ్స్ అధికంగా కలిగిన పండ్లు, కూరగాయలు, చేపలు తినడం వల్ల సరైన సమయంలో అండం విడుదలకు సహాయపడుతుంది. సోయా ప్రొడక్ట్స్, బీన్స్, గుడ్డులోని పచ్చసొన, బంగాళదుంపలు, గోధుమపిండి, క్యాబేజ్, ఆస్పరాగస్, బీట్ రూట్, అరటిపండు, బ్రొకోలి మరియు తణధాన్యాలు వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండి ప్రత్యుత్పత్తి కి బాగా ఉపయోగపడుతాయి.

యోగా: ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపాలి: సరైన సమయంలో అడం విడుదల కాకపోవడానికి ఒత్తిడికూడా ఒక ప్రధానమైటువంటి కారణమే. యోగా చేయడం వల్ల ఆ ఒత్తిడి దూరం చేయొచ్చు. యోగాతో పాటు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా మరియు శరీరాన్ని ఫిట్ గా, చురుగ్గా ఉంచడంలో సహాయపడుతాయి. ఎక్ససైజ్ చేయడం వల్ల చాలా సులభంగా, త్వరగా కన్వీస్ కాగలుగుతారు. కాబట్టి ప్రతి రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి వెచ్చించండి.

బరువు: అండం విడుదల కావడానికి ఇది మరొక సులభమైన పద్దతి. మీరు మీ ఎత్తుకు తగ్గ బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లైతే అది మీ ఫెర్టిలిటీ చాన్సెస్ ను తగ్గిస్తుంది. కాబట్టి పిల్లలకోసం ప్లాన్ చేసే వారు రెగ్యులర్ గా బరువును చెక్ చేసుకుంటా నిర్ధిష్టబరువును మెయింటైన్ చేయాలి. అందుకు మీరు డైయట్ పాటించాలనుకుంటే మీ డాక్టర్ ను సంప్రదించండి. అందువల్ల మీరు ఎంత బరువు తగ్గాలనే విషయాన్ని మీ డాక్టర్ ద్వారా మీరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

బెటర్ రిలేషన్ షిప్: జీవిత భాగస్వామి పట్ల సన్నిహితంగా మెలుగుతూ ఆనందంతో, ప్రేమతో జీవించాలి. చాలా మంది జీవితంలో ఈ ప్రేమ లేకపోవడం వల్లే సంతానోత్పత్తి స్థాయిల్లో తగ్గదల కనబడుతోంది. పార్టర్న్స్ తో సన్నిహితంగా గడపలేనంత భారీ షెడ్యూల్, పని ఒత్తిడి మరియు సమయం లేకపోవడం ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. కాబట్టి సహజ పద్దతుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుచుకోవాలనుకొనే వారు మీ బాగస్వామితో సన్నిహితంగా, కొంత సమయాన్ని వారికోసం కేటాయించండి.



Click it and Unblock the Notifications