Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
డెలివరీ అయ్యేంత వరకు ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించాలంటే..!
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఏ నెల డాక్టర్ దగ్గర చూపించుకోవాలనే దానిపై చాలా మంది తర్జనబర్జన పడుతుంటారు. అయితే వైద్యులు ఏం సూచిస్తున్నాంటే.. ప్రెగ్నెన్సీ ఎంత త్వరగా కన్ఫార్మ్ అయితే అంత త్వరగా వైద్యులకు చూపించుకోవాలని చెబుతున్నారు. ముందు నుంచి ఏవైనా అనారోగ్య సమస్యలు వున్నా, థైరాయిడ్ సమస్యలు వున్నా, బ్లడ్ ప్రెజర్ లేక ఇతర జబ్బులకు ఏవైనా మందులు వాడుతున్నా ఎటువంటి మార్పులను చేసుకోవాలో వైద్యులు చెబుతారు. మొదటి త్రైమాసికం చాలా సున్నితంగా వుండాలి కాబట్టి ఏ మందులు వాడాలి, వాడకూడదు అనే విషయలను కూడా వైద్యులు సూచిస్తారు గనుక తప్పకుండా వైద్యులను సాధ్యమైనంత త్వరగా సంప్రదించాలి.

ప్రెన్సెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 28 వారాలు వచ్చే వరకు ప్రతీ నెల వైద్యలను సంప్రదించాలి. 7 నుంచి 8 వారాలు వున్నప్పుడు స్కాన్ చేసుకుంటారు. 11 నుంచి 14 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ చేసుకుంటారు. ఈ మధ్యలో డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అనే టెస్టులు కూడా వుంటాయ్. హెచ్ఐవీ, బ్లడ్ గ్రూపింగ్, షుగర్ స్థాయిలను టెస్ట్ చేసుకోవడం, థైరాయిడ్ కు సంబంధించిన పరీక్షలను చేసుకుంటారు. రెండు డోసుల వరకు టీటీ ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. ఇవన్నీ మొదటి 7 నెలల వరకు జరుగుతుంది.
5వ నెలలో టిఫా స్కాన్ వుంటుంది. కడుపులోని బిడ్డకు ఏదైనా లోపం వుందాలేదా అనేది ఈ స్కాన్‌లో తెలిసిపోతుంది. ఇప్పటి వరకు చెప్పినవన్నీ బేసిక్ స్కానింగ్‌లు, బేసిక్ టెస్టులు, ఇవన్నీ 7 నెలల లోపు పూర్తవుతాయ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ కచ్ఛితంగా తీసుకోవాలి. 28 వారాల తరువాత కడుపులో బిడ్డ వేగంగా పెరగడం ప్రారంభమౌతుంది. ఈ 28 వారాల నుంచి తరువాత ప్రతీ రెండు వారాలకు ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎందకంటే బీపీ లెవెల్స్ వేగంగా పెరిగే అవకాశం వుంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్ కూడా తగినంత లేకపోతే ప్రమాదం వుంటుంది. అలా 9 నెలలు నిండే వరకు డాక్టర్‌ను సంప్రదించాలి.
36 వారాలు నిండిన తరువాత ప్రతీ వారం డాక్టర్‌ను కచ్ఛితంగా సంప్రదించాలి. ఎందుకంటే కడుపులోని బిడ్డ పూర్తిగా ఎదిగి వేగంగా పెరగడం ప్రారంభమౌతుంది. గర్భినికి వేరే ఏవైనా అనారోగ్య సమస్యలు వుంటే మరిన్ని ఎక్కువ సార్లు డాక్టర్ వద్దకు విజిట్ అవ్వాల్సి వుంటుంది. ప్రెగ్నెన్సీ వున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అస్సలు మిస్ కావద్దు.
గర్భిణులు వైద్యులను ఎప్పుడు సంప్రదించాలనే దానిపై నిబంధనలను కూడా జారీ చేశారు. 16 వారాలకు ఒక సారి, 24 నుంచి 28 వారాల మధ్యలో ఒక సారి, 32 వారాలు నిండినప్పుడు ఒకసారి, ఇక 36 వారాలు నిండినప్పుడు ఒకసారి వైద్యులను సంప్రదించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను జారీ చేసింది. వైద్యలను సంప్రిదించడం గనుక మిస్ అయితే కడుపులో బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వున్నా మనం తెలుసుకోలేము.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలను ప్రముఖ వైద్యుల నుంచి తీసుకోవడం జరిగింది. వీటిని మేము సంపూర్ణంగా దృవీకరించము. అయితే ఇవ్వబడిన సమాచారం నాణ్యమైనదని స్పష్టం చేస్తున్నాం.



Click it and Unblock the Notifications