Latest Updates
-
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
తినటానికి పిల్లలు సతాయిస్తున్నారా?

ఇష్టంలేని పదార్ధాలను తినమని పిల్లలను బలవంతం చేయటం సరికాదని పిల్లల నిపుణులు చెపుతారు. ఇష్టం లేని పదార్ధాల జాబితా అత్యధికంగా వుంటుంది. పాలు, కూరలు, పండ్లు, కాయ ధాన్యాలు మొదలైనవేవీ పిల్లకిష్టముండవు. వారికి కావలసింది చిప్స్, ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు, కేకులు మొదలైనవి.
పిల్లలు ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలను తినాలంటే, కొన్ని చిట్కాలు పరిశీలిద్దాం....
1. పిల్లలు తినే బర్గర్లు, శాండ్ విచెస్, ఫ్రైస్ మొదలైనవి ఆరోగ్యమైన కూరలు, గొధుమ బ్రెడ్ మొదలైన వాటితో తయారు చేయండి. బర్గర్లలో మంచింగ్ కై చేసే వాటిలో వివిధ రకాల కూరలు వాడండి. మంచి నాణ్యతగల నూనెలు వాడి వాటిని వేపుడు చేయండి.
2. పండ్లు, కూరలు అందంగా కట్ చేయండి వాటికి సైడ్ గా ముంచుకోడానికి ఇంట్లోనే తయారు చేసిన తాజా పెరుగు, పాలు, కొద్దిపాటి మసాలాలు పెట్టండి. పండ్లలో తేనె కలిపి ఇవ్వండి.
3. డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్ లో అందుబాటులో వుంచండి. వారి కిష్టమైనపుడు వాటిని ఎగరేసుకు తింటారు.
4. పిల్లలకు తినటానికి విసుగు పుట్టకుండా వంటకాలు మార్చండి. వారికిష్టమైన రీతిలో చేయండి.
5. ఇతర తల్లులు వారి పిల్లలకు ఏ ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నారో తెలుసుకోండి. ఈ రకంగా మరికొన్ని తిండి పదార్ధాలు మీ జాబితాకు జత చేయండి.
6. ప్రతిరోజు పాలు తాగుతూంటే, ఒక రోజు వాడికి పెరుగు, జున్ను లేదా వెన్న, లేదా పనీర్ వంటివి ఇవ్వండి.
7. గుడ్లు ఉడికించి కట్ చేసి ఉప్పు, పెప్పర్ వేసి ఇవ్వండి. మరో రోజు ఆమ్లెట్ తయారు చేయండి.
8. చిన్నగా తరిగిన కూరలు, ఆకులు దోశ, ఇడ్లీ మొదలైన వాటికి ముందు ఇవ్వండి. పోషకాలు బాగా అందుతాయి.
9. పిల్లాడి రుచులు తెలుసుకోండి. వాడికి మసాలాలు ఇష్టమైతే, కొద్దిగా వేస్తూ వుండండి.
10. ఆహారం వారికి నిర్దేశిత సమయంలో ఇవ్వండి. ప్లేటంతా ఖాళీ చేయమని బలవంతం చేయకండి. వారికెపుడు అవసరమైతే అపుడు తినమనండి. అయితే కొంత సమయంలోపలే ప్లేట్ ఖాళీ చేయాలని చెప్పండి. ప్రతి ఆహారానికి, అది పూర్తి కాకపోయినా సరే, 30 నిమిషాలకంటే అధిక సమయం ఇవ్వవద్దు.
ఈ చిట్కాలు పాటించి మీ బిడ్డ ఆహారం సరిగా తినేలా చేయండి. బిడ్డ ఆహారపుటలవాట్లు మెల్లగా మార్చండి.



Click it and Unblock the Notifications