For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అణగని వెంట్రుకలు - ఎదిగే పిల్లలు!

By B N Sharma
|

Hair Care Tips For Kids
ఎదిగే పిల్లల జుట్టుపై శ్రధ్ధ పెట్టాలి. ఆటల కారణంగా జుట్టు త్వరగా మురికి పడుతుంది. పేలు పడటం, జుట్టు ఊడటం వంటి సమస్యలు కూడా వుంటాయి. అందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

1. పిల్లల జుట్టు వారంలో 3 లేదా 4 సార్లు కడిగేలా చూడండి. జుట్టు పొట్టిగా వుంటే నీటితో రెగ్యులర్ గా కడిగేయవచ్చు. అవసరం అనుకుంటే రోజూ తల స్నానం చేయించండి.
2. పిల్లల తల జుట్టు వాష్ చేయటానికి నో టియర్స్ షాంపూ ఉపయోగించండి. వీటిలో రసాయనాలు వుండవు. వారి కళ్ళు మండకుండా వుంటాయి.
3. పిల్లల తల రుద్దేటపుడు మెల్లగా వేళ్ళతో రుద్దండి. గోళ్ళు ఉపయోగించవద్దు.
4. పిల్లకు పొడవు జుట్టు వుంటే హెయిర్ కండిషనర్ రాయండి. జుట్టు చిక్కు పడకుండా తేలికగా దువ్వవచ్చు.
5. తలంటు తర్వాత వెడల్పు పళ్ళ దువ్వెనతో వెంట్రుకలు దువ్వండి. చిక్కు పడకుండా వుంటాయి. పిల్లల దువ్వెన పెద్దలు వాడకండి. తల ఎక్కువ సార్లు రోజులో దువ్వితే జుట్టు పెరుగుతుందనేది సరికాదు. అధికంగా దువ్వితే, జుట్టు ఊడే ప్రమాదముంది.
6. జుట్టు రెగ్యులర్ గా కట్ చేస్తూ వుంటే ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు ఆనందించే పార్లర్ లో అందంగా కట్ చేయించి వారికి రూపలావణ్యాలు కలిగించండి.
7. జుట్టు ఊడకుండా వుండాలంటే ఎపుడూ ముడి వేయండి.
8. పిల్లలు అందంగా వుండాలంటే, రంగు రంగుల క్లిప్పులు, ఇతర సాధనాలు అమర్చండి.

ఈ చర్యలు పాటిస్తే, మీ పిల్లల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది.

English summary

Hair Care Tips For Kids | అణగని వెంట్రుకలు - ఎదిగే పిల్లలు!

Wash the kid's hair 3-4 times in a week. If the kid has short hair, it is best to wash the hair with water regularly. Kids are always near dirt and pollution which can affect the scalp. So, wash 3-4 times in a week and water everyday if possible.
Story first published:Monday, October 24, 2011, 14:06 [IST]
Desktop Bottom Promotion