Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
పిల్లల పెంపకాలు!.....పెద్దల ప్రణాళికలు!!

అసలు ఇద్దరూ ఉద్యోగం చేయడం ఎంత వరకూ అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. తప్పనిసరైతే పరవాలేదు. కానీ.. టైమ్‌పాస్ కోసం అయితే మాత్రం ఇరువురూ ఉద్యోగం చేయనవసరం లేదు. వారిలో ఒకరు ఆ సమయాన్ని కాస్త పిల్లల పెంపకంపై పెడితే, మీ పిల్లలు కూడా.. ఓ అబ్దుల్ కలాం, ఓ ఐన్‌స్టీన్ వంటి గొప్ప వాళ్లు కాగలరు.
మరో రకంగా ఆలోచిస్తే, పిల్లలకు కావలసిన అవసరాలన్నీ డబ్బుతోనే తీరుతాయనుకోవడం సరైన ఆలోచన కాదు. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుతో కొనలేమనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి స్నేహం, మరొకటి ప్రేమ. ఇవి రెండూ.. పిల్లలకు అందించాల్సిన అవసరం వుంది. మీ పిల్లల కోసం అధిక సమయాన్ని కేటాయించండి. మంచి చెడుల గురించి తెలియజేయడం. సమాజంలో ఎలా జీవించాలో.. ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో వివరంగా చెప్పండి. సాధారణంగా ప్రతి కుటుంబలో తండ్రి కుటుంబ పెద్దగా ఉండి ఎంతో కొంత సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడు. అది మానవధర్మం కూడాను. అయితే తండ్రి సంపాదించే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోతే.. తల్లి కూడా తప్పనిసరై ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలాంటపుడు తల్లి ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కొంత అధిక సమయాన్ని పిల్లల కోసం కేటాయించే అవకాశం కలుగుతుంది.
పిల్లలకు తల్లితండ్రులు తమను పట్టించుకోవడం లేదనే భావనలు కలగకుండా.. మీ తీరిక సమయాన్ని వారి కోసం తప్పక కేటాయించండి. ఒక రకంగా ఇలా చేయడం మీకు కూడా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లలతో ఆనందంగా గడపడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంత జీవనం గడుపుతారు. కాబట్టి మీ పిల్లలతో మీరు సంతోషంగా గడిపి వారిలో కలిగే అభద్రాతాభావాన్ని తొలగించండి. అపుడు అందరూ చక్కటి సంబంధాలతో సుఖపడతారు. పిల్లలు భవిష్యత్తులో మీరు చూపిన ప్రేమలు, ఆప్యాయతలనే వారసత్వ సంపదగా ముందు తరాలవారికి సైతం అందించే అవకాశాలున్నాయి.



Click it and Unblock the Notifications
