Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలను స్వతంత్రులుగా పెంచడమెలా?

ఇతర జంతువులవలే కాకుండా పసిబిడ్డ పుట్టిన సమయంలో ఎంతో నిస్సహాయంగా వుంటాడు. తనకి తాను ఏ మాత్రం సంరక్షించుకోలేడు. ప్రతి విషయం నేర్పించాల్సిందే. మిమ్మల్ని ఆధునిక తల్లితండ్రులు చేయటానికిగాను కొన్ని అంశాలను ఇస్తూన్నాం పరిశీలించండి. పిల్లలకు భాధ్యత అంటే ఏమిటో నేర్పించాలి. భాధ్యత అనేది చెప్పటంకన్నా చేపడితేనే బాగా తెలుస్తుంది. నీటిలో పడవేస్తే, ఎంత ఈత రానివాడైనా సరే. ఈతకొట్టి బయటకు రావటానికి ప్రయత్నిస్తాడు. కనుక పిల్లవాడికి భాద్యతలుంటే అతను లేదా ఆమె వాటిని నిర్వహించటానికి కృషి చేస్తారు.
పిల్లలు వారికి వారే స్వతంత్రులుగా నిర్వహించుకోడమనేది దానంతటదే జరిగే పనికాదని గుర్తుపెట్టుకోండి. సురక్షితమైన తల్లి ఒడిని వదలటానికి ఏ బిడ్డా ఇష్టపడడు. వారికి మంచి జరుగుతుందని చెపుతూ వారిని ప్రోత్సహించాలి. పిల్లాడికి ఒక సారి చెప్పండి అక్కడి నుండి వాడు ఎలా ప్రవర్తిస్తాడనేది చూడండి. చిన్నపాటి విషయాలను చెప్పండి. స్వతంత్రంగా ఎలా చేస్తారో చూడండి. ఉదాహరణకు ఒకరోజు కొన్ని వంటకాలు ఎలా చేయాలో చెప్పండి. వారంలో కొద్ది రోజులు వంట గిన్నెలు కడిగే అవకాశమివ్వండి. సరిగ్గా చేయకపోతే సహనం కోల్పోకండి. అది వారికి శిక్షణగా భావించండి.
వారి పనులను వారే చేసుకోటానికి ప్రోత్సహించండి. వారి బట్టలు మీరు ఉతకద్దు. వారి బెడ్ మీరు అమర్చవద్దు, కొత వయసు వచ్చిన తర్వాత మీ చేతులతో తినిపించవద్దు. వారి గది వారే శుభ్రం చేసుకోవాలి లేదా మురికిలో వుండాలి. మీరు చేస్తారులే అన్న భరోసా వారికుంటే కనుక వారు ఎప్పటికి నేర్చుకోరు. ఒక్కసారిగా వారు స్వతంత్రులు కాలేరు. వివిధ దశలలో భాధ్యతలు అప్పగించాలి. మిమ్మల్ని అనేక ఇబ్బందులు పెడతారు. కాని మీరు చాలా గ్టిగా నిలబడి మీ విధానాలు వారు అమలు చేసేలా చూడాలి. అయితే కొంతమంది పిల్లలు స్వతంత్రతకు ఇష్టపడతారు. మీ పిల్లవాడు ఏ కోవకు చెందినప్పటికి ఏదో ఒక మార్గంలో మీరు వ్యవహరించాల్సిందే. మీ పిల్లవాడికి చెప్పేముందుగా మీకు మీరు అవగాహన చేసుకోండి. పిల్లవాడు బాధపడుతున్నాడని తెలిస్తే మీరు అతనికి బాసటగా వుండి మరింత నేర్పించండి. పిల్లవాడిని వాడి భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారనేది అది వాడి మంచి భవిష్యత్తుకని మొదట మీరు గ్రహించాలి.
ఈ సామాన్య చిట్కాలు ఆచరించి మీ పిల్లలను స్వతంత్రులుగా చేయండి.



Click it and Unblock the Notifications