Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
దురుసు ప్రవర్తన తగ్గాలంటే... !

కొన్ని సార్లు పిల్లలు తమకేది చేసినప్పటికి తల్లితండ్రులు సహిస్తారు. కాని ఇతరులపై పిల్లలు దురుసుగా ప్రవర్తిస్తే వారిని దండిస్తారు. ఇది తప్పు. పిల్లాడికి మీకు...ఇతరులకు బేధం తెలియదు. మొదటగా పిల్లాడు మిమ్మల్ని కొట్టకుండా మాన్పించండి. ఇది చేయగలిగితే, వాడు ఇతరరులను కూడా కొట్టడు. పిల్లాడు మిమ్మల్ని కొడుతున్నా, గిచ్చుతున్నా లేక కొరుకుతున్నా మొదటి సారే మీరు దానిని సీరియస్ గా తీసుకోండి. పిల్లాడిని తిరిగి కొట్టకండి. అలా చేస్తే, మీరు అతనితో సమానమని భావిస్తాడు. కళ్ళతో బెదిరించి అతని చర్యలను నిలుపు చేయాలి.
లేదా...మరో చర్యగా వాడు చేసే పనులు పట్టించుకోకండి. పిల్లాడి ఎనర్జీ అంతా ఖాళీ అయితే ఇక తాను చేసే పనులు మీరు పట్టించుకోరని తెలిసి వాడు మానేస్తాడు. పిల్లాడిని ప్రభావించే హింసాత్మక సన్ని వేశాలను మీరు నిలుపుచేయండి. హింసాత్మక కార్టూన్లు, ఆటలు మొదలైనవి చూడటం మాన్పించండి. కనీసం మీరు కూడా వాడి ముందర అరవడం, కొట్టడం వంటి చర్యలతో హింసాత్మకంగా ప్రవర్తించకండి. కుటుంబంలోని సభ్యులెవరైనా వాడి ముందర అలా ప్రవర్తించినా నిలుపు చేయండి. పిల్లాడు అలా తయారయ్యాడంటే దానికి కారణం పెద్దలే. అతిగా ప్రేమించే ఇంటిలోని సభ్యులు కూడా ఒక్కొక్కపుడు వాడు కొడితే ...తిరిగి వాడిని కొట్టడం వంటివి చేసి నేర్పిస్తారు.
ఈ చిట్కాలు చేపట్టి పిల్లాడు ఎవరిని కొట్టకుండా చూడండి.



Click it and Unblock the Notifications
