Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ముందు జాగ్రత్తలతో ముప్పు తప్పినట్లే!

పిల్లలు పడటం: పిల్లలు ఎత్తు ప్రదేశాలనుంచి పడ్డపుడు గాయాలౌతాయి. వీటికి సత్వర చికిత్సకు గాను ఇంటిలో ఐస్ ముక్కలుంచితే, వాటితో గాయమైన ప్రదేశంలో రుద్దితే తక్షణం రక్తం ఆగటమే కాక నొప్పి కూడా తగ్గుతుంది.
ముక్కు నుండి రక్తం కారటం - పిల్లలకు ఉన్నట్టుండి ముక్కునుండి రక్తం కారతూ వుంటుంది. దీనిని అరికట్టాలంటే తలను కిందకు అదిమిపట్టి తలపై ఐస్ ముక్కనుంచి, ముక్కు మూసి నోటితో గాలి పీల్చుకోమనాలి. వెంటనే రక్తం కారటం తగ్గుతుంది.
కాలిన గాయాలేతే - వంటగదిలో అటూ ఇటూ తిరుగుతూ వేడెక్కిన స్టవ్ లు, లేదా గిన్నెలు ముట్టుకుని గాయాలు చేసుకుంటారు. ఆ సమయంలో కాలిన గాయాలకు కాఫీపొడి లేదా పసుపు లేదా కిళ్ళీలలో వేసే కాసు వంటివి రాయవచ్చు. గాలి బాగా తగలాలి. తర్వాత వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళి గాయం ఎంత తీవ్రంగా అయిందనేది పరీక్షించి వైద్యం చేయించండి.
కుక్క లేదా పిల్లి కరవటం -ఎంత పెంపుడు కుక్క అయినప్పటికి ఒప్పుడో ఒకప్పుడు పిల్లలను కరుస్తూ వుంటుంది. కరిచిన శరీర భాగాన్ని నీటితో బాగా అయిదారుసార్లు కడగండి. యాంటీ సెప్టిక్ లోషన్ రాసి వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళండి.
ఆహారం తినేటపుడు మింగలేక ఊపిరాడకపోతే - ఖంగారు పడవద్దు దగ్గరకు తీసుకుని పిల్లాడి తలను ముందుకు వంచి పొట్టకి రెండువేపులా రెండు చేతుల్ని ఉంచి, వీపు భాగంపై తట్టుతూ వుంటే లోపల ఇరుక్కున్న ఆహారం సర్దుకుంటుంది. ఈ సమయంలో పిల్లాడు నోటితో శ్వాస తీసుకునేలా చూడాలి.



Click it and Unblock the Notifications
