Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పిల్లల కోసం 5 సోహసోపేతమైన క్రీడలు-చిల్డ్రన్స్ డే స్పెషల్
బహుశా చాలా మంది పిల్లలకు ట్రేడిషినల్స్ స్పోట్స్ మీద అంత శ్రద్ద పెట్టారు. ముఖ్యంగా బేస్ బాల్, ఫుట్ బాల్ లేదా బాస్కెట్ బాల్ ఇలా... అందుకు కారణం వాటికున్న స్ట్రక్చర్ లేదా రూల్స్ లేదా ఒత్తిడే కారణం కావచ్చు. అయితే వారు ఎప్పుడు కొత్త ఆటలపైన శ్రద్ద చూపుతారు. ఫిజికల్ గా సాహసోపేతమైన ఆటలు ఆడటానికి ఎక్కువ ఇష్టపడుతారు.

రాక్ క్లైబింగ్ పిల్లలకు ఒక చాలెంజింగ్ లా, సరదా ఉండేటటువంటి యాక్టివిటి అని చెప్పొచ్చు. దీని వల్ల పిల్లలకు శారీరకంగా మరియు మానసికంగా కావాల్సినన్నిఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రాక్ క్లైంబింగ్ లో మీ పిల్లలకు తగినన్ని భద్రత జాగ్రత్తలు గురించి వివరించాలి. కొన్ని అనుభవ జాగ్రత్తలను విపులంగా వివరించడం వల్ల పిల్లలు జాగ్రత్తగా, సరదాగా రాక్ క్లైంబింగ్ పూర్తి చేస్తారు. లేదా అనుభవం ఉన్న శిక్షకుడి దగ్గర శిక్షణ ఇప్పించడం చాలా అవసరం. అతని పర్యవేక్షణలోనే ఇటివంటి కార్యక్రమాలు చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే శిక్షణ ఇచ్చే సంస్థలు మీ పిల్లలకు తగిన భద్రత ఏర్పాట్లను చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. ఒక వేళ మీ పిల్లలను రాక్ క్లైంబింగ్ కు పంపడానికి భయపడుతున్నట్లైతే దానికి అనుసందానమైనటువంటి వాల్ క్లైంబింగ్ కు పంపించవచ్చు.

ట్రెక్కింగ్ మీ పిల్లల కోసం ఒక రోజు క్యాంప్ కోసం ప్లాన్ చేయండి. లేదా పిల్లల పేర్లు నమోదు చేయించండి. అయితే ట్రెక్కింగ్ కు వెళ్ళే పిల్లల వయస్సు కనీసం 4-5సంవత్సరాలు కలిగి వుండాలి. ట్రెక్కింగ్ అనేది పిల్లలకు సాహసోపేతమైన క్రీడ మాత్రమే కాదు. అతను ఏ మార్గంలో వెళుతున్నాడు, ప్రకృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది పిల్లలకు పర్యావరణం గురించి తెలుసుకోవడానికి చాలా గొప్ప మార్గం. ట్రెక్కింగ్ లో ఉత్సాహం కనబిరిచే పిల్లలకోసం చాలా సంస్థలు నిర్వహించడానికి అనేక క్లబ్బులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని క్లబ్బులు ట్రెక్కింగ్ కు వెళ్లే వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా పర్వతారోహణకు అనుమతిస్తుంది.

పిల్లలకు రివర్ క్రాసింగ్ చాలా సరదా అయినటువంటి క్రీడ. నదికి రెండు వైపులా ఒక తాడును కట్టి దాని వెంబడి పిల్లలను నడవడానికి, నడిపించడానికి ఈ క్రీడ ఏర్పాటు చేయిస్తుంటారు. ఇటువంటి సాహసోపేతమైన క్రీడలను పెద్దవారికి మాత్రమే ఉంటాయి. అయితే పిల్లలు చేత చేయించడానికి శిక్షణ తప్పనిసరి. రివర్ క్రాసింగ్ సమయంలో వారిని అనుసరిస్తూ శిక్షకులు ఉండటం కూడా మంచిది.

త్రాళ్ళతో అధిరోహించడం అంటే చాలా కష్టమైన పనే. బ్యాలెన్స్ చేస్తూ క్రింది నుండి పైకి ఎక్కాల్సి ఉంటుంది. అయితే పిల్లల కోసం ఇండోర్ లోపల మాత్రమే ఇటువంటి క్రీడలను ఆడటానికి కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి ఉంటాయి. అవి వారికి క్షేమం కూడా. మీ పిల్లలు రాక్ లేదా వాల్ క్లైంబింగ్ ఎక్కడానికి ఇష్టపడుతున్నట్లైతే వారిని త్రాళ్ళతో ఎక్కడానికి ప్రయత్నించమని చెప్పండి.

బంగీ జంపింగ్ పిల్లలకు చాలా ఇష్టమైన సరదా ఆట. మీ పిల్లలు ఇంట్లోనే ట్రామ్పోలిన్ మీద బంగీజంపింగ్ ను ప్రయత్నించవచ్చు...
కొత్తగా ఆటలు ఆడటం అంటే రాక్ క్లైబింగ్, ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, రివర్ క్రాసింగ్ మరియు త్రాళ్ళతో అధిరోహించడం వంటి సాహసోపేతమైన ఆటలు ఆడటం వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. ఇటువంటి వాటిలో ఎక్కువ శ్రద్ద చూపించినా ఎటువంటి ప్రమాదం ఉండదు. పూర్తిగా సురక్షితం. చాలా దేశాలలో పిల్లల కోసం సాహస క్రీడలు నిర్వహించడానికి అనేక సంస్థలు నెలకొల్పబడ్డాయి.



Click it and Unblock the Notifications
