Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మీ పిల్లలకు ఫ్యాషన్ డిజైనర్ మీరేనా?
ఒకప్పుడు ఫ్యాషన్ అనేది పిల్లలకు వర్తించేది కాదు. వారు సామాన్యంగా ఉండేవారు. కాని మారుతున్న నేటి రోజులలో పిల్లలు కూడా ఫ్యాషన్లకు అలవాటుపడ్డారు. కనుక ఫ్యాషన్ అనేది వారికి కూడా ఒక పెద్ద అంశంగా తయారైంది. వారికి ఏది సరి? ఏది సరికాదు అనేవి ఒక ప్రత్యేక అంశం అయిపోయింది. మీకు నచ్చిన అంశాలు మీ బిడ్డకు బలవంతంగా ఇకపై చేయటానికి వీలులేదు. వారికిష్టమైనవి మీరు చేయాలి. అయినప్పటికి మీరు మీ పిల్లల ఫ్యాష్ తీరులను నియంత్రించాల్సిందే.
నేడు పిల్లలు ఫ్యాషన్ పేరుతో వేస్తున్న దుస్తులు కొంతమందికి విస్మయాన్ని కలిగిస్తున్నాయి. కాగా మరి కొంతమంది వాటికి అలవాటు పడి కొనసాగుతున్నారు. కనుక ఈ ఫ్యాషన్ తీరు ఒక వ్యక్తిగత ఛాయిస్ అయిపోయింది. పిల్లలకు సౌకర్యంగా వుంటూ మీరు సరైనదని భావిస్తే, ఫ్యాషన్ దుస్తులు కొన్నా పరవాలేదు. మరి మీ బిడ్డలకు మీరే ఫ్యాషన్ డిజైనర్ గా ఎలా వుండాలి? అనే అంశాన్ని కొద్దిగా పరిశీలించండి. మీ పిల్లలను నేటి ప్రపంచంలో గుర్తింపు పొందే వారుగా ఉంచండి.

మీ పిల్లలకు ఫ్యాషన్ డిజైనర్ మీరే?
సౌకర్యం కావాలి - ఫ్యాషన్ పేరుతో పిల్లలకు అసౌకర్యంగా ఉండరాదు. వారికి సౌకర్యమైన వాటిని ఎంపిక చేయండి. దుస్తులు మరీ పొట్టి లేదా పొడవుగా ఉండరాదు. వేసుకుంటే వారు హాయి భావించాలి. పిల్లలకు వేసుకుంటే బాగున్నా, చూచేందుకు మీకు అసౌకర్యంగా ఉంటే, వాటిని మీరు మార్చండి.
బాగా బిగువు అయినాయా? - బాగా టైట్ గా ఉండే దుస్తులు పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. దుస్తులు బిగువైతే, అజీర్ణం, గాలి సరిగా ఆడకపోవటం, వేడికి చర్మం మండటం వంటి సమస్యలుంటాయి. అలాగని మీ పిల్లలు బాగా వదులైన దుస్తులు ధరించరాదు. వారికి సరిగా సరిపోయే దుస్తులు వేయండి. వారి శరీరంకనుక పెద్దదై దుస్తులు సైజు చాలకుంటే వాటిని తీసివేయండి.
హై హీల్స్ ఎపుడు వేయాలి? పిల్లకు అయిదు సంవత్సరాలు వచ్చాయంటే చాలు హైహీల్స్ కోరుతుంది. కనుక మీరు అందుకు సిద్ధంగా ఉండాలి. వయసు సరిగా రాని పిల్లలు హై హీల్స్ వేస్తే, ఎముకల సమస్య వస్తుంది. వెన్ను నొప్పి, కాలి మడమలు నొప్పి వంటివి వస్తాయి. అంతే కాదు అవి వారి ఎదుగుదలను కూడా అరికడతాయి.
సినిమాల దుస్తులా ...వేయకండి - పిల్లలు చాలా ఫ్యాషన్లు కోరుతున్నారు. సినిమాలో చూసిన పిల్లల దుస్తులు తమకు వేయమని కోరుతారు. సినిమాల దుస్తులు వంటి వెర్రి ఫ్యాషన్లు మీ పిల్లలకు వద్దని నచ్చచెప్పండి. నేటి మీడియా, ఛానెళ్ళు, సినిమాల పుణ్యమా అని పిల్లలు, పెద్దలు వేసుకునే అసభ్య దుస్తులు కోరుతున్నారు. వారి అమాయక బాల్యాన్ని మనం కాపాడాలి. బాల్యంలో వారికి సరిపోయే దుస్తులు చూడ ముచ్చటగానే ఉండాలి కాని వెర్రి ఫ్యాషన్లతో ఉండరాదు.
దుస్తులు ఒక సందేశంగా - మీ పిల్లవాడు టి షర్టులు వేయటానికి ఇష్టపడుతున్నాడా, అందునా, వాటిపై గల సందేశాలు మీకు తగినట్లుగా ఉన్నాయా? అంటే, పచ్చదనం - పరిశుభ్రం వంటి చక్కటి సందేశాలనిచ్చేవిగా ఉండాలి. అవి అతని మనోభావాలకు సరిపోయేలా ఉన్నాయో లేదో చూడండి. వ్యతిరేకంగా ఉంటే, పిల్లవాడికి తగిన కౌన్సెలింగ్ చేయండి.
పిల్లల దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే, మీ బిడ్డకు మీరే ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించవచ్చు.



Click it and Unblock the Notifications