Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
పిల్లల ఎదుగుదలకు విలువలైన పౌష్టికాహారం..నెయ్యి..!

రోగనిరోధక వ్యవస్థను బలోపేతము చేస్తుంది . రోజుకు 2 - 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా హోర్మోనైజ్ అవుతుంది. నెయ్యిలో సాచ్యురేటెడ్ ఫాట్స్ ఉన్నందున కొలెస్టిరాల్ ని తగ్గిస్తుంది. నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది.
1. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర ఆహార పదార్థాలు కూడా కారణమయ్యే అవకాశం ఉంది.
2. నెయ్యి బలహీనంగా ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. పిత్తం, వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు. ఇంకా తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
3. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది.
4. ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది.
5. అరటి పండు గుజ్జులో, కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు.
6. పొడి చర్మతత్వం, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావు చెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది.
7. కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి.
8. ముక్కు నుంచి రక్తస్రావమవుతోంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది.
9. పనిపిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది.
10. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications