Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీ బిడ్డ వేలిముద్రలో అతని భవిష్యత్తు!

ఇంతవరకు తల్లితండ్రులనుండి సంక్రమించే జీన్స్, వ్యక్తిత్వ లక్షణాలు ఆధారంగా భవిష్యత్తు నిర్ణయించేవారు. కాని ఇపుడు కొత్త పరిశోధనల మేరకు వ్యక్తులలోని నిగూఢ తెలివితేటలను, ఫింగర్ ప్రింట్ల ఆధారంగా కూడా నిర్ణయించి వారి భవిష్యత్తు ఎలా వుంటుందనేది తెలుపుతున్నారు. త్వరలోనే మనదేశంలో ఇది భవిష్యత్ చెపటంలో ఒక ప్రధాన అంశంగా రూపొందుకోగలదంటున్నారు రీసెర్చర్లు
దీనికి సైంటిఫిక్ వివరణ ఎలా?
దీనిని మొదటగా స్కూలుకు వెళ్ళే పిల్లలతో మొదలుపెట్టారు. ఈ స్టడీకి ఆధారం అంటే, పిల్లల వేళ్ళపై వుండే ముద్రలు వారి ఎడమ, కుడి బ్రెయిన్ లపై వున్న ముద్రలకు పోలివుంటాయనేదిగా వుంటుంది. ఇవి వ్యక్తిలో సహజంగా వున్న తెలివితేటలను ప్రతిబింబిస్తాయి.
రీసెర్చర్లు ముందుగా పది ఫింగర్ ప్రింట్లను సేకరించి ఫలితాలను ధియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజన్సీస్ తో సరిపోల్చారు. ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది రకాలుగా తమ తెలివితేటలను సగటు స్ధాయిలో పోటీ చేయవచ్చన్నారు. ఈ తెలివితేటలు మీరు ఎంత స్ధాయిలో మీలోని నైపుణ్యాలకు పదునుపెట్టగలరనేది నిర్ణయిస్తాయి. ఎడమ బ్రెయిన్ తో ఆలోచించేవారైతే ప్రతి అంశాన్ని విశ్లేషిస్తారని, కుడి బ్రెయిన్ తో ఆలోచిస్తే కళాకారులవుతారని తెలుపుతుంది.
ప్రతి ఒక్కిరికి వారి బిడ్డల భవిష్యత్తు ఎలా వుంటుంది ? అనే ఆందోళన వుంటుంది. బిడ్డ ఇంజనీర్ లేదా కళాకారుడు, లేదా క్రికెటర్ అవ్వాలని వుంటుంది. కాని అతడు తల్లితండ్రుల ఒత్తిడి కారణంగా తాను అవ్వాలనుకునేది కాలేకపోవటం కూడా చాలా కేసులలో జరుగుతుంది. కనుక ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పిల్లవాడు భవిష్యత్తులో ఏ రకమైన వృత్తి వ్యాపారాలకు తగినవాడవుతాడనేది వెల్లడవుతుంది. వాటిలోప్రవేశపెడితే అతని తెలివితేటలు మరింతగా రాణించే అవకాశం వుంది.



Click it and Unblock the Notifications
