Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
దీపావళి రోజున పిల్లల పట్ల తీసుకోవల్సిన చిరు జాగ్రత్తలు

1. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. పిల్లలు దీపావళి సామగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.
2. బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది.
3. పిల్లలు చేతిలో బాంబులు అసలు పేల్చొద్దు. ఒక్కోసారి కాకరపూలు కూడా పేలే ప్రమాదముంది. కాబట్టి పిల్లలకు ముందుగా ప్రమాదాల గురించి చెప్పాలి. టపాసులు కాల్చేటప్పుడు చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకూడదు.
4. పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని పూరిళ్లకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు. అలాగే భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.
5. పిల్లలు అందమైన డ్రస్ లు వేసుకుంటే అందరికి ఆనందమే. అయితే ఆ ఆనందం అలానే వుండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలీయస్టర్, సిల్క్ మొదలైనవి తేలికగా మంటలను అందుకుంటాయి. అందుకని ఈ పండుగకు వారికి మరో జత కాటన్ దుస్తులు కొనండి. సాయంత్రమయ్యే సరికి టపాసులు కాల్చటానికి సిద్ధమయ్యే పిల్లలకు కాటన్ దుస్తులు వేస్తే వారు వెలిగించే ఫైర్ వర్క్స్ తో మీకు ఎటువంటి సమస్యా రాదు.
6. పిల్లలకు పొడవైనవి, బాగా లూజుగా వుండే దుస్తులు వేయవద్చు. టపాసులు కాల్చటం కష్టం కూడా అవుతుంది. పూజ సమయంలో ఏ దుస్తులు ధరించినప్పటికి, సాయంత్రమయ్యే సరికి బిగువుగా వుండే ప్యాంటు, షర్టు వంటివి వేయండి. వీటితో పిల్లలు టపాసులు కాల్చటం తేలికవుతుంది.
7. పిల్లలకు అన్ని రకాల టపాసులు ఇవ్వొద్దు. ప్రత్యేకించి పేలే టటువంటి టపాకాయలు వారికి సురక్షితం కాదు. అందుకని స్పార్క్ లర్స్ మాత్రమే ఇచ్చి వారిని ఆనందింపచేయండి. వారు ఒంటిరిగా కాల్చకుండా పెద్దవారి సమక్షంలో కాల్చేలా చేయండి. టపాసులు నాణ్యతగలవిగా ఎంపిక చేసి లైసెన్సులు కల డీలర్ల వద్ద మాత్రమే కొనండి.
8. పిల్లలు టపాకాయలు చూస్తే ఎంతో ఉత్సాహం. ఆ ఉత్సాహంలో జాగ్రతలు మరిచిపోతారు. కనుక ప్రతి టపాకాయను ఎలా పేల్చాలో వారికి తెలియజేయండి.
9. టపాసులు కాల్చే ప్రదేశం కూడా సరైనదై ఉండాలి. రోడ్డు మధ్యలో లేదా ఇంటి లోపల, గుంపులు వున్న చోటో కాల్చవద్దని పిల్లలకు తెలియజెప్పాలి.
10. వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి పిల్లలకు ప్రత్యేకించి వాటి గురించి చెప్పిన తర్వాత వారికి అందివ్వాలి.
ఈ జాగ్రత్తలను పాటించి దీపావళి పండుగను హాయిగా, ఆనందంగా జరుపుకోండి.



Click it and Unblock the Notifications
