Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
పిల్లల లంచ్ బాక్స్ కు ఏమి ఇస్తున్నారు...?

1. పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి.
2. కూల్ డ్రింక్స్ తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి.
3. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి.
4. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది.
5. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన ఆహారపదార్థాలనే పుష్టినిచ్చే ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండి పెట్టవచ్చు. ఉదాహరణకు కొంతమంది పిల్లలు దోసెలంటే ఇష్టపడతారు. అలాంటి వారికి పాలకూర, తోటకూర, మెంతికూర లాంటి పలురకాల ఆకుకూరలు కలిపి గ్రైండ్ చేసి దోసెలు వేయవచ్చు. లేకుంటే చట్నీలోనూ ఆకుకూరలు కలిపి చేయవచ్చు. దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది.
6. క్యారెట్, బఠానీలు, బీన్స్ లతో ఫ్రైడ్‌రైస్ చేసి లంచ్‌బాక్సులో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
7. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, బీట్ రూట్ లను చిన్నచిన్న ముక్కలు చేసి ఇడ్లీల్లో కలిపితే పోషక పదార్థాలు పిల్లలకు అందుతాయి.
8. చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా పల్లీలతో చేసిన ఉండలు, చిక్కీలు, నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు పెట్టండి. ఇంటికొచ్చాక పిల్లలకు శనగలు, పల్లీలు, బఠానీలు గుప్పెడు ఇవ్వాలి.
9. అన్నం, పంచదార, ఎగ్ లతో పుడ్డింగ్ చేసి పెడితే పెరిగే పిల్లలకు మంచిది.
10. మురుకులైనా ఏ పిండి వంటలైనా ఇంట్లో చేసుకోవాలి తప్ప, సూపర్ మార్కెట్, బజార్ లలో దొరికే పదార్థాలను పిల్లలకు పెట్టవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
