Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు మీ ట్రైనింగ్ ఎంతో అవసరం...!

చక్కని స్నానం: ప్రతి రోజూ తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం వారికి స్నానం చేయించాలి. దీని వల్ల వారి శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, చెమట, చెడుబాసన బయటకు పోవడమే కాకుండా వారు ఉత్సాహంగా ఉంటారు. మంచి యాంటీ బ్యాక్టీరియా సబ్బుతో స్నానం చేయించాలని మర్చిపోకండి.
తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలను వారికి తొడగండి. వారంలో కనీసం మూడు సార్లు తలస్నానం చేయించండి. కొంచెం పెద్ద పిల్లలైతే స్నానం చేసే విధానం గురించి వివరంగా తెలియజేయండి. ముక్కులు, చెవుల బయటి భాగాలను శుభ్రం చేసుకోవడం గురించి కూడా తెలియజేయండి. చేతులు పరిశుభ్రంగా: చిన్నారుల చేతులతో ఏవిపడితే అవిపట్టుకుంటారు. వారి చేతులు బ్యాక్టీరియా స్థావరాలు. అందుకే ప్రతి పనికి ముందు, తర్వాత సోప్ తో చేతులు కడగడం తప్పనిసరి. ఇందుకు మంచి యాంటీబ్యాక్టీరియా సబ్బును వాడాలి.
ఆహారం తీసుకునే ముందు, బయటి నుంచి వచ్చిన తర్వాత, టాయిలెట్ కు వెళ్లి వచ్చిన తర్వాత, ఇంట్లోని బొమ్మలు, కుక్కలతో ఆడుకున్న తర్వాత, మట్టిలో ఆడుకుని వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కునేలా చర్యలు తీసుకోండి.
దంతాలు పరిశుభ్రంగా: చిన్నారులు చాక్లెట్లు, తియ్యటి వస్తువులు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి పళ్లలో ఆగిపోతే అక్కడ క్రిములు పోగయ్యి పళ్లు పాడైపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు మంచి పేస్ట్ తో బ్రెష్ చేసుకునేట్లు చూడండి.
చిన్నారులకు చేతిరుమాలు తప్పనిసరిగా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చేతిరుమాలును అడ్డుపెట్టుకోమని చెప్పడం ద్వారా మిగతా పిల్లలకు ఎలర్జిక్ వైరస్ అంటకుండా నిరోధించవచ్చు. అలాగే గాలిదుమ్ము రేగినప్పుడు రుమాలను అడ్డుపెట్టుకోవమాని చెప్పడం మంచిది. ఇలా ఆరోగ్యం గురించి, ముఖ్యంగా శారీరక పరిశుభ్రత గురించి వారికి వివరంగా తెలియజేయడం ద్వారా చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉంచవచ్చు.



Click it and Unblock the Notifications