Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
పిల్లలు స్వతంత్రంగా వ్యవహరించాలంటే?!

1. ఇంట్లో ఒక పార్టీ ఏర్పరచండి - కంప్యూటర్లు, టి.వి.లు, వీడియోగేములు పిల్లాడితో ఆపించండి. అవి మంచి స్నేహాలకు శత్రువులు. రుచికరమైన స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఏర్పాటు చేసి ఇంటి చుట్టు పక్కల మీ పిల్లాడి వయసువున్న పిల్లలను ఆహ్వానించండి. వారితో కలసి మాట్లాడేలా చేయండి.
2. ఆటలు - ఎక్కువమంది పిల్లలు కలిసి ఆడే ఆటలు ఆడించండి. కలసి ఆడితే, స్నేహానికి గెలుపు ఓటములు అందించే అలవాటు పిల్లాడికి కలుగుతుంది. కొత్త భాషలు తెలుసుకునే అవకాశం వుంటుంది.
3. ఇంటివద్దకు -మీ పిల్లాడి స్నేహితులను ఇంటికి రమ్మనండి. అతడిని ప్రత్యేకంగా వుంచక వారితో కలసి స్కూలుకు వెళ్ళడం ఇంటికి రావడం వంటివి నేర్పించండి. మీకు కూడా కొంత ఫ్రీ టైమ్ దొరుకుతుంది.
4. కలిసి చదవటాన్ని ప్రోత్సహించండి - పిల్లాడు తన స్నేహితుడితో కలిసి చదువుకుంటానంటే అంగీకరించండి. కలసి చదివితే, నాలెడ్జి అధికమవుతుంది.
5. ఇచ్చి పుచ్చుకోడం - మీరు స్నాక్స్ వంటి తినే పదార్ధాలను ఒక గ్రూపుకు తయారు చేస్తే, అవి మీ పిల్లాడు వారికివ్వటం, స్నేహాన్ని పెంచుకోడం వంటివి కూడా చేస్తాడు. స్నేహాన్ని పెంచే పుస్తకాలను చదవమని ప్రోత్సహించండి.
అంతేకాదు, పిల్లలలో నేడు ఆట పాటలు లోపిస్తున్నాయి. కనుక వారిని బహిరంగ ప్రదేశాలైన పార్కులు వంటి వాటిలో ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. చెట్లు ఎక్కడం, గోలీలు ఆడటం, బిళ్ళం గోడు ఆడటం వంటి సాంప్రదాయక పిల్లల ఆటలు నానాటికి తగ్గిపోతున్నాయని తాజాగా ఇంగ్లాండులో చేసిన ఒక అధ్యయనం తెలిపింది. పిల్లలకు ప్రకృతితో సంబంధం వుండే ఆటలు వెనుకబడుతున్నాయని, వారికి సహజ ప్రకృతితో సంబంధాలు వుండటం లేదని అధ్యయనకారుడు ఇప్సోస్ మోరి వెల్లడించారు. ఆయన తన స్టడీలో సుమారు 1,012 మంది వ్యక్తులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేశారు.
వారిని వారికి గుర్తువున్న చిన్నతనంలోని 12 అవుట్ డోర్ అనుభవాలను అంటే, చెట్లు ఎక్కడం, గోలీలు ఆడటం, బిళ్ళం గోడు ఆట, పక్షులకు ఆహారం వేయటం, వంటివి చెప్పవలసిందిగా కోరారు. ప్రజలలో 92 శాతం మంది పిల్లలకు ప్రకృతితో సంబంధం వుండే అవుట్ డోర్ ఆటలు అవసరమేనని తెలిపారు. 82 శాతంమంది, పాఠశాలలు పిల్లలకు బయటి ఆటలు కూడా బోధించాలని తెలిపారు. రీసెర్చిలో పిల్లలకు ప్రకృతితోగల సంబంధం వారి విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక నేర్పులు మొదలగువాటిపై ప్రభావం చూపగలదని తేలింది.
అయితే, నేటి రోజులలో అట్టి అవకాశాలు తగ్గి ప్రకృతితో వ్యతిరేక సంబంధిత ఫలితాలు పిల్లలకు, కుటుంబాలకు, సమాజానికి కలుగుతున్నాయని ఇది ప్రకృతి లోపం డిజార్డర్ గా ప్రజలలో రూపొందుతోందని అధ్యయనం తెలిపింది. ఇంటర్నెట్, వీడియే గేములు, మొదలైన ఇండోర్ వ్యాపకాలు పిల్లలలో పెరిగిపోవటంతో వారికి బయటి చర్యలు సమర్ధవంతంగా చేసే అవకాశం కూడా లేకుండా పోతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.



Click it and Unblock the Notifications
