Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
రోజుకు 7 గంటల కంప్యూటర్ ఆటలు!

కొంతమంది పిల్లలైతే, ఒకే సారి రెండేసి పరికరాలు కూడా వాడి తమ కంప్యూటర్ సమయాన్ని రోజుకు 10 గంటలపాటు కూడా గడిపేస్తున్నారట. గత అయిదేశ్ళలో పిల్లలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ పరికరాలు విరివిగా వాడేసి వారి ఎలక్ట్రానిక్ లైఫ్ బాగా పెంచుకుంటున్నారు. ఎన్నో రకాల టెలివిజన్ కార్యక్రమాలు, ఫిల్ములు, మ్యూజిక్, మల్టీమీడియా ఆటలు వంటి వాటిని ఆనందిస్తున్నారు. స్టడీలో కనుగొన్న వాస్తవాలు, పిల్లల సంక్షేమ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రీసెర్చి ఫలితాలు తల్లితండ్రులను తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించమని తెలుపుతున్నాయని వారు వెల్లడించారు.
కొంతమంది పిల్లలకైతే, ఈ పరికరాలు, ఒక మత్తుమందువలే, వారు ఇంటిలో గొడవచేయకుండా వుండటానికిగాను అనుమతించబడుతున్నాయన్నారు. పిల్లలు, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటపుడు వేరెవ్వరితోనూ కనీసం మాటలు కూడా మాట్లాడరు. ఎవరైనా ఏదేని అడిగినప్పటికి పెడచెవిని పెట్టడం జరుగుతోంది. పిల్లలు మెసేజ్ లు పంపటంలో నిపుణులుగా తయారవవచ్చు. కాని వారు వ్యక్తులను కలసి మాట్లాడటంలో చాలా తక్కువ నైపుణ్యతను కలిగి వుంటున్నారని రీసెర్చర్లు తెలుపుతున్నారు.
తల్లితండ్రులు ఇప్పటికే తమ పిల్లల ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అధిక సమయం కేటాయించి అలసత్వం ప్రదర్శిస్తున్నారని చిన్నపిల్లలైన వీరికి ఈ పరికరాలకుగాను తగిన సమయం కేటాయించి వారిలో వ్యక్తిగత మెళుకువలు తీసుకురావాలని రీసెర్చర్లు తెలిపారు.



Click it and Unblock the Notifications
