Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
పిల్లలలో ఆందోళన తగ్గించడమెలా?

పిల్లల అలసట గుర్తించటమెలా? వారిలో తాత్కాలికంగా ప్రవర్తనా మార్పులు కనిపెట్టాలి. మూడ్ స్వింగ్స్, చెప్పినమాట వినకపోవటం, నిద్రించే పద్ధతిలో మార్పులు, నిద్రలో మూత్రం చేయటం వంటివి లక్షణాలుగా వుంటాయి. కొంతమంది పిల్లలకు శారీరక సమస్యలు అంటే, పొట్టనొప్పి, తలనొప్పి వంటివి కూడా వస్తాయి. ఇతరులకు హోం వర్కు చేయటం ఇబ్బందిగా కూడా వుంటుంది. మరి కొంతమంది అసలు ఏ పనీచేయక చాలా సమయం ఒంటరిగా వుంటారు. మరీ చిన్నపిల్లలైతే, బొటనవేలు చీకటం, జుట్టు పీక్కోవడం, ముక్కు గిచ్చటం, వంటివి చేస్తారు. పెద్ద పిల్లలు, అబద్ధాలు చెపటం, పోట్టాడటం, పెద్దలను తిరస్కరించడం చేస్తారు. పెద్దలను వదలటానికి ఇష్టపడరు. చిన్న సమస్యలకు పెద్దగా స్పందిస్తారు. విద్యలో వెనుకపడతారు.
ఒత్తిడి ఎలా తగ్గించాలి?
వారికి తగినంత విశ్రాంతి, పోషకాహారం ఏర్పరచాలి. వారితో సంభాషణకు సమయం ప్రతిరోజూ కేటాయించాలి. మీరు వారితో గడపాలి. మీరు తమాషాగా వారితో ఆడుతూంటే చాలు కొంతమంది పిల్లలు ఒత్తిడి తగ్గించుకుంటారు.
పిల్లలు పెద్దవారయ్యే కొద్ది వారితో సమయం గడపటం ప్రధానం. మీకు ఎంత కష్టమైనా సరే వారికి కొంత సమయం కేటాయించండి. వారు మీకు ప్రధానం అని భావిస్తున్నట్లు వారికి తెలియాలి.
వారికి ఆందోళన కలిగించే విషయాలు చెప్పమని కోరండి. కలసి కొన్ని పరిష్కారాలు రూపొందించండి. అవసరమనుకుంటే, కొన్ని స్కూలు కార్యక్రమాలు తొలగించండి. దానికి బదులు, వ్యాయామం, జర్నల్ వ్రాయటం వంటివి చేయించండి.
కొంత ఒత్తిడి సాధారణమని గ్రహించండి. కోపం, భయం, ఒంటరితనం, ఆందోళన కొంత మేరకు వుంటాయి. అవి వారిని స్వతంత్రంగా ప్రవర్తించేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications
