Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
తల్లి తండ్రులతో కలసి మందు కొడితే?

బాబు బర్త్ డే....ఆధునికంగా వుండాలి? మన స్టేటస్ కు తగ్గట్లు పార్టీ జరగాలి. మరి పార్టీకి వచ్చే వారంతా హై ఫై సొసైటీ. మందు తప్పని సరిగా వుండాలి. అందరి చేతుల్లోను గ్లాసులు వుంటే....మన పిల్లాడి చేతిలో లేకుంటే చిన్నతనమే. గ్లాస్ పట్టుకోరా బాబూ అంటే తాగేయనే తాగేశాడు అంటారు తల్లితండ్రులు. ఇంటిలోనే బార్ కేబినెట్, సాయంత్రం అయ్యే సరికి తండ్రికి విస్కీ దైవం...తల్లికి బ్రాందీ ఆధారం. మరి వారిద్దరూ అభిమానించే కుమారుడికి ....ఇంటిలోనే పుచ్చుకో బయటి కల్తీలు వద్దు అంటూ పాఠాలు చెప్పటం. వారు చెపటంలోను, కుమారుడు వినటంలోనూ ఏ మాత్రం అసాధారణంగా వారిమధ్య కనపడటం లేదు. హేంగోవర్ కి మరుసటి రోజు ఏం చేయాలి? అనేది కూడా తల్లితండ్రులే పిల్లలకు నేర్పించేస్తున్నారు.ఈ వ్యవహారమంతా మగ పిల్లలకే పరిమితం కావటం లేదు. ఆడ పిల్లలు సైతం తల్లితండ్రుల పక్కన చేరి తాగేస్తున్నారు. సిటీ పబ్ లు మామ్....డాటర్లకు ప్రత్యేక ప్రోత్సాహక పధకాలు ఇచ్చేస్తున్నాయి. వీరికి, వీలైనంతవరకు ఇంట్లోనే తాగండి అనేది ఇంటి పెద్ద సూచన.
ఈ రకంగా తమతోపాటు, ఇంటివద్దే తాగించటంలో పిల్లలకు ఎంతవరకు తాగాలో ...అనే లిమిట్ కూడా నేర్పిస్తున్నామనే తల్లితండ్రులు. నాకు ముగ్గురు కొడుకులు అందరూ 25 సంవత్సరాల పైబడినవారే...వీరికి భాధ్యతాయుతంగా ఇంటిలో ఎంత తాగాలో నేను బాగా నేర్పించాను, నేడు వీరు శుభకార్యాలు జరిగితే ఇంట్లోనే పార్టీలు ఇచ్చేస్తారు. పార్టీలు అయిన తర్వాత స్నేహితులకు ఇళ్ళకు వెళ్ళటానికి కార్లు ఏర్పాటు చేసేస్తారు అంటారు ఈ హై సొసైటీ తల్లితండ్రులు. పిల్లలతో వ్యవహరించటంలో ప్రధాన విషయమేమంటే మీకు సరి అని తెలిసిన దానిని పిల్లలకు పూర్తినా నేర్పించేయాలని, వాటిలోని సాధక బాధకాలు వారికి పూర్తిగా అవగాహన అవుతాయని, నియంత్రణ ప్రధానమని, నియంత్రణ కూడా వారికి నేర్పించేస్తే ఇక ఎట్టి సమస్య వుండదని వీరు భావిస్తారు.
మారుతున్న సమాజంలో ఆధునికంగా పబ్ లు, బార్లలో తల్లి తండ్రులు, పిల్లలు కలసి లిక్కర్లు తాగటానికి రావటం సాధారణమైపోతోందని రెస్టరెంట్ బార్ల యజమానులు సైతం అంగీకరిస్తున్నారు. ఒకరి సమక్షంలో మరి ఒకరు తాగటం, సమయం గడపటం అలవాటు పడిపోతున్నారని, అయితే, వీటి దుష్ప్రభావాలు ఆ మందు మితిమీరితే ఎలా వుంటాయనేది తాము ఇంతవరకు తమ బార్లలో ఎదుర్కొనలేదని కూడా వీరు తెలుపుతున్నారు.



Click it and Unblock the Notifications