Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
స్నాక్స్ తింటే పిల్లల ఏకాగ్రత అధికం!

పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటై షుగర్ అధికంగా వుండి వారిలో హైపర్ యాక్టివిటీ కలిగి మరింత అల్లరి చేసేస్తారని టీచర్లు వాపోతున్నారట. అయితే సైంటిస్టులు మాత్రం కొద్దిపాటిగా వీటిని ఇచ్చినప్పటికి ఫలితం బాగానే వుంటుందని చెపుతున్నారు. షుగర్ హైపర్ యాక్టివిటీనిస్తుందని ఎక్కడా రుజువు కాలేదని. ఇది పిల్లలలో మెమొరీని, ఏకాగ్రతలను పెంచుతుందని ప్రొఫెసర్ డెవిడ్ బెంటన్ చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.
అయిదు నుండి పదేళ్ళ లోపు పిల్లలకు పెద్దవారితోపోలిస్తే రెండింతల గ్లూకోజ్ కావాలని, అయితే, శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా కాక బ్రెయిన్ తనకవసరమైన గ్లూకోజ్ ను నిల్వ వుంచుకోలేదని, అది ఎప్పటికపుడు రక్తంలోనుండే తీసుకుంటుందని అధ్యయన కర్తలు చెపుతున్నారు.
పిల్లలకు కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినిపించాలని, కాని నేడు వారికి అధికంగా ఒకే సారి తినిపిస్తూ వుండటం వలన అధిక బరువు సమస్యలు వస్తున్నాయని కూడా ఈ ప్రొఫెసర్ చెపుతున్నారు.
స్టడీలో, బెంటన్ 16 మంది 9 - 10 సంవత్సరాల పిల్లలకు గ్లూకోజ్ వున్న పండ్లరసాలను ఆర్టిఫిషియల్ డ్రింకులను ఇచ్చారు. వీరందరకు మెమొరీ పరీక్షలు పెడితే 10 శాతం మెమొరీ పెరిగినట్లు తేలింది. తరగతిలో ఇచ్చే పనికి 11 నుండి 20 నిమిషాలు అధికంగా కూడా వీరు చేయగలిగినట్లు తేలింది.
అయితే, పిల్లలకు ఆర్టిఫిషియల్ డ్రింక్ లు కు బదులుగా తాజా పండ్ల రసాలవంటివి ఇవ్వాలని బెంటన్ ప్రతిపాదిస్తున్నారు.



Click it and Unblock the Notifications
