Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అడ్డుపడకుంటే...అబార్షన్లు, ఆత్మహత్యలు?

టీనేజ్ లో అన్నీ ఎంతో బాగున్నట్లు భావిస్తారు. కాలేజీ రొమాన్స్ అధికమవుతుంది. అయితే, ఈ దశలో తల్లితండ్రులు పిల్లలు ఏం కోరుతున్నారనేది గ్రహించి వారిని సవ్యమైన మార్గంలో పెట్టాలి. వారిని నిందించి ప్రయోజనంలేదు. వారికి మీరు చిన్నతనంలో ఏం చేశారనేది వివరించి వారితో మీ భావనలు పంచుకోండి. టీనేజ్ పిల్లలు, వారి స్నేహాలు, ప్రేమ జీవితమంతా వుంటాయనే భావిస్తారు. అందుకుతగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వయసులో అన్ని బాగా వుంటూ కనిపిస్తాయనేది వారికి వివరించాలి. మీరు పిల్లలతో స్నేహపూరితంగా వ్యవహరిస్తూ, వారికి మీరు అండగా వున్నారన్న భావన కలిగించాలి.
ఈ వయసులో రొమాన్స్ మొదలుపెడితే దాని ప్రభావం చెడుగా కూడా వుంటుందని వారికి అర్ధం అయేలా చెప్పాలి. జీవిత భాగస్వామి వేరు, స్నేహం వేరు అని, ప్రతి స్నేహితుడు లేదా స్నేహితురాలు జీవిత భాగస్వామి కాజాలరని వివరించండి. స్నేహానికి జీవితానికి మధ్య గల కొద్దిపాటి వ్యత్యాసాన్ని వారికి వివరించండి. లేదంటే, టీనేజ్ లోనే ఆడపిల్లలు గర్భవతులవ్వడం, అబార్షన్లు లేదా ఆత్మ హత్యలు వంటివి పిల్లలలో జరగటం కూడా సంభవిస్తుంది. తల్లితండ్రులు కూడా ఆధునికంగా తమ పిల్లలతో వ్యవహరించాలి. పిల్లలు సురక్షితంగా వున్నంతవరకు వారి స్నేహాలను ప్రోత్సహించాలి. ఆంక్షలు తీవ్రంగా పెడితే పిల్లలు వ్యతిరేకించి మరింత నష్టపోతారని తల్లితండ్రులు తెలుసుకోవాలి.
ఈ సూచనలతో తల్లితండ్రులు తమ పిల్లల టీనేజ్ సరస సల్లాపాలను నియంత్రించి వారు భాధ్యతాయుత వ్యక్తులుగా సమాజంలో ఎదిగేందుకు తీర్చిదిద్దాలి.



Click it and Unblock the Notifications
