Latest Updates
-
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.?
వయసు ఏదైనా.... తల వెంట్రుకలు అందమే...!

సరైన ఆహారం - మంచి పోషకాహారం ఇవ్వటం ద్వారా పిల్లల తల వెంట్రుకల పెరుగుదలను మెరుగు పరచవచ్చు. జంక్ ఫుడ్ మాన్పించండి. వాటి స్ధానంలో ఆరోగ్య కరమైన పండ్ల రసాలు, విటమిన్లు, పోషకాలు కల ఆహారాలను పిల్లలకివ్వండి. వారి ఆమారంలో విటమిన్ ఎ మరియు సి తప్పక వుండేలా చూడండి. ఇవి పచ్చటి ఆకు కూరలు, కూరగాయలు, ఆరెంజస్, సిట్రస్ జాతి పళ్ళు ఆహారంలో తప్పక చేర్చండి.
ప్రొటీన్ - బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు పెట్టండి. వీటిలో ఎల్ సిస్టైన్, ఎమినో యాసిడ్ మొదలైనవి వుండి వెంట్రుకల కుదుళ్ళు కొత్తవి పెరిగేలా చేస్తాయి. ఇలా ప్రొటీన్లు అధికం కల ఆహారాలు తింటే, అవి త్వరగా ఊడే దశరకు చేరుకోవు. మాంసం, చేపలు, పాలు, గుడ్లు మరియు పప్పులు ప్రొటీన్లు బాగా వుండే ఆహారాలు. మీ బిడ్డ తల చర్మ గ్రంధులు బాగా ద్రవాలను తయారు చేయాలంటే, ఈ ఆహారాలు వాడాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు - మీ పిల్లల ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వుండే చేప, సల్మాన్, బాదం పప్పులు వంటివి చేర్చండి. ఆహారంలో ప్యాకేజ్ ఆహారాలు కాక ఆరోగ్యకరమైన కొవ్వులు వుండే ఆహారాలు పెట్టండి.
ఐరన్ మరియు జింక్ - మీ బిడ్డ జుట్టు ఎదుగుదలకు, జింక్, ఐరన్ లు బాగా సహకరిస్తాయి. పిల్లలు సాధారణంగా పచ్చని కూరగాయలు తినటానికి ఇష్టపడరు. అయితే వీటిలో వుండే పోషకాలు వారికి చాలా అవసరం కనుక తప్పక తినిపించాలి. వివిధ రీతులుగా వండి పిల్లలకు రుచించే విధంగా తినిపించాలి.
ఈ ఆహారాలు మీపిల్లల డైట్ లో చేర్చటమే కాక, వారి తల చర్మం ఎల్లపుడూ శుభ్రంగా వుండేలా చూడండి. తల వెంట్రుకలు కడిగే ముందు, తలకు నూనె రాయండి. ఎపుడు తల మురికిపట్టినా కడగండి. తల కడిగిన తర్వాత హెయిర్ డ్రయ్యర్ లేదా బ్లోయర్ వంటి వాటితో పొడి చేయకండి. తల వెంట్రుకలు సహజంగా వాటంతట అవే ఆరాలి. దువ్వుకునే మెళకువలు వారికి నేర్పించండి. వెడల్పు పళ్ళు వున్న దువ్వెన లేదా బ్రష్ ఉపయోగించాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ఇది వారి కుధుళ్ళను బలపరచి బ్రెనయిన్ కు రక్త ప్రసరణ బాగా వుండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications