Latest Updates
-
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026 -
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.!
కొత్తగా తలితండ్రులైన వారు తెల్సుకోవలసిన విషయాలు
తలిదండ్రులుగా పిల్లలను సంరక్షించడం అతి పెద్ద పనేనని మేము అంగీకరిస్తాము - తొమ్మిది నెలల గర్భం ఆరోగ్యంగా ఉండటం, పురిటినొప్పులు పడటం, పాకుతున్నప్పుడు వారి వెంట ఉండటం, వారికి తినిపించడం, టాయిలెట్ ను వాడటం నేర్పడం వంటి దశలు - నిజానికి ఎంతో దీర్ఘమైన అనుభూతి. కాని మిమ్మల్ని మొదటిసారి మీ బిడ్డ అమ్మా-నాన్న అని పిలవడం వినటంతోనే ఒక ఉత్సాహం చుట్టుముట్టి ఈ నొప్పులు, బాధలు అన్ని మటుమాయం అయిపోతాయి.
పుట్టిన బిడ్డల సంరక్షణకు తలిదండ్రులకు ఎంతో కృషి, శక్తి అవసరమౌతాయి. దీని వలన మీ బిడ్డ పెరిగి, వృద్ది చెందడాన్ని మీరు దగ్గర నుండి గమనించడం వలన మీరు పొందే అనుభూతి వెలకట్టలేనిది. ఈరోజున మేము ప్రతి కొత్త తలిదండ్రులకు కాలకృత్యాలను తీర్చుకోవడంతో బాటు చిన్న పిల్లలుగా ఉన్నప్పటినుండి వారి సంరక్షణకు కొన్ని చిట్కాలు సమర్పిస్తున్నాం.
దీని వలన పిల్లల సంరక్షణ మీకు ఎంతో (కొంత మెల్లగా) తేలికైన పనిగా మారుతుంది.

కాలకృత్యాలను తీర్చుకోవడానికి కొన్ని గంటలు పట్టవచ్చు
మీ బిడ్డను మలినాల విసర్జించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఈ కృత్యాన్ని కొంత మంది బిడ్డలు త్వరగా ముగించి మీకు ఆశ్చర్యాన్ని కల్గిస్తారు. కాని మీ బిడ్డ నుండి కూడా ఇదే ఆశించకండి; మీ బిడ్డ తన మలినాలను విసర్జించడానికి కొన్ని గంటల సమయం తీసుకొనవచ్చు. అతనికి కావలసినంత సమయం తీసుకోనివ్వండి. ప్రశాంతంగా ఉండండి - అని డా. శిల్ప అంటున్నారు.

ఎలాస్టిక్ నడుములు మీ బిడ్డలకు స్నేహితులు
మీ బిడ్డలకు బట్టలు తొడగడం, తీయడం సులువుగా, కష్టం లేకుండా చేయండి. చాలామంది బిడ్డలకు గుండీలు, జిప్పులు ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ సమయం తీసుకోవడ౦ వలన వారు బాత్రూంకు వెళ్ళవలసి వస్తే అసహనంగా మారుతారు. అందువలన, ఎలాస్టిక్ నడుము ఉన్న పాంటులను, షార్టులను వారు గుండీలు, బట్టలు మార్చడంతో సౌకర్యంగానే ఉందనుకొనే వరకు వాడండి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడకండి
కొత్త సాంకేతికత అంటే మీకు సరదా అయి ఉండవచ్చు, కాని మీ బిడ్డలను ఇది కాస్త భయ పెట్టవచ్చు. మీరు మీ బిడ్డను బాత్రూంకు తీసుకొని వెళ్ళినప్పుడు, ఆటోమేటిక్ గా పని చేసే ఫ్లషర్ అక్కడ బిగించి ఉంటే, దాని శబ్దానికి మీ బిడ్డ బిగుసుకొనిపోవచ్చు. ఈ భయం ఎక్కువై పోయి మీ బిడ్డ బాత్రూంకు ఒంటరిగా ఎప్పటికి వెళ్ళలేక పోవచ్చు.

తక్కువ పని చేసి ఎక్కువ సమయం మీ బిడ్డతో గడపండి
మీరు, మీ బిడ్డ దృష్టిలో పడాలంటే, మీరు కూడా తగినంత సమయం మీ బిడ్డతో గడపాలి. మీ బిడ్డకు ఆనందాన్నిచ్చే పనులపై దృష్టి పెట్టండి. మీరు మీ బిడ్డతో ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ పనులను చేయడం ఆపండి. ఇది మీ బిడ్డతో మీకున్న అనుబంధాన్ని దెబ్బతీయవచ్చు.

మీరు ఎంతో ఎక్కువగా బెడ్ షీటులను మార్చవలసి ఉండవచ్చు.
రాత్రి పూట పక్క తడపకుండా ఉండటానికి కొంత మంది బిడ్డలకు ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ బిడ్డ పక్క తడిపి మేలు కొంటే అతనిని అరవకండి. ఇది ఎంతో సహజమైంది. అతను పక్క తడపడానికి కారణం అతను గాఢ నిద్రలో ఉండి ఉండవచ్చు. పక్కను మార్చి అతనిని ప్రశాంతంగా పడుకోనివ్వండి.

మీకు కొత్త స్నేహితులు దొరుకుతారు
మీ స్నేహితుల జాబితా అంతులేనిదై ఉండవచ్చు, కాని వారందరూ ఇప్పుడు ఒక పరాధీయ సమూహంగా మిగిలి ఉండవచ్చు. ఇప్పుడు మీ స్నేహితులను మీరు ఎంచుకోలేరు, వారిని మీ బిడ్డ మీకు వెతికి పెడతాడు. ఇటువంటి రోజుల్లో, ఆడుకొనే మైదానంలో లేదా స్కూల్ లో మీ బిడ్డతో కలిసి ఆడే బిడ్డల తలిదండ్రులతో మీరు స్నేహం చేస్తారు.

మీ లివింగ్ రూమ్ ఎంతో గందరగోళంగా మారుతుంది
మెల్లగా మీ బిడ్డ ఎదుగుతున్నప్పుడు, మీ బిడ్డ దొర్లడం, పాకడం, చివరిగా నడవడం చూసి మీరు ఆనందిస్తారు. కాని ఈ ప్రశాంత క్షణాలు మీ బిడ్డ కదలడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక పీడకలగా మారుతాయి.
మీ బిడ్డ ఒక కొంటె రాక్షసునిగా మారినప్పుడు, మీ లివింగ్ రూమ్ ఒక గందరగోళంగా మారడం మీరు చూస్తారు. అకస్మాత్తుగా మీ అల్మారా ఖాళీగా మారి మీ బట్టలన్ని నేలమీదకు, మీ బిడ్డకు అందుబాటులో ఉన్న వస్తువులన్నీ నేలమీద లేదా గదిలోని మూలలలో చేరతాయి.
ప్రశాంతంగా ఉండండి. ప్రమాదకరమైన వస్తువుల దగ్గరకు మీ బిడ్డ చేరేందుకు వీలు లేకుండా చేయడం మరవకండి.

ఒక యుక్తవయస్సులో ఉన్న బాలిక కంటే ఎక్కువ ఉపాయాలను మీ బిడ్డ పన్నవచ్చు.
తన బిడ్డ స్నేహితులతో కలిసి పన్నే అనేక ఉపాయాల కథలను ప్రతి తల్లి లేదా తండ్రి వింటూనే ఉంటారు. ఇటువంటి ఉపాయాలతో మాటలు చెప్పడం ప్రతి బిడ్డ పనే అయినప్పటికీ మీరు ప్రేమతో, క్రమశిక్షణతో కూడిన జాగ్రత్తతో మీ బిడ్డ చేసే పనులకు అడ్డుకట్ట వేయడం ఒక తల్లిగా లేదా తండ్రిగా మీరు చేయవలసిన పని.

మీ ప్రసూతి సెలవు ఉద్యోగంలోని అతి కష్టమైన పని దినాల కంటే ఎంతో కష్టంగా ఉంటుంది
మీ ప్రసూతి సెలవు ఉద్యోగంలోని అతి కష్టమైన పని దినాల కంటే ఎంతో కష్టంగా ఉంటుంది
మీ ఉద్యోగంలోని అన్ని పనులను పూర్తి చేసి మీరు ప్రసూతి సెలవును తీసుకొని ఉండవచ్చు. ప్రసూతి సెలవు మొదలయ్యే చివరి రోజు మీ సెలవు రోజులు మొదలయ్యాయని అనుకోవచ్చు. కాని మీ కోసం ఇక్కడ ఒక ఆశ్చర్యం ఉంటుంది. మీ ప్రసూతి సెలవు మీ బిడ్డతో మీ బాంధవ్యం గట్టి పడటానికి నమ్మశక్యం కాని ఒక సమయం కాని ఇది కొంత భయం కల్గించేది కూడా అయి ఉండవచ్చు.

మీరు మీ బిడ్డతో ఉన్నప్పుడు, ప్రతి విషయం ఎంతో మధురంగా ఉంటుంది
మీ బిడ్డను మీరు అప్పుడే అరచినప్పటికి అతనితో ఎన్నో ఆశ్చర్యకరమైన మధుర క్షణాలు గడపవచ్చు. వీటిని ఎప్పటికి మర్చిపోకుండా ఉండాలనుకొనే ప్రతి తల్లి లేదా తండ్రికి ఇవి ఎంతో ప్రత్యేకమైనవి.
మీ బిడ్డతో మీరు బాగా గొడవ పడినప్పుడు, మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ ముక్కుపైన ముద్దు పెట్టుకొని గుసగుసగా, సున్నితంగా మీతో, ఐ లవ్ యు అనగానే ఆ రోజు మీకు మరవరానిదౌతుంది.



Click it and Unblock the Notifications