Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మనం తినే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలో ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింత పెరుగుతుంది. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేవెూ గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు.
ఇలా మరిచిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే వున్న భయం, టెన్షన్ కావచ్చు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్లా, భయం వల్లా పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి.
2. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
3. పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్ బి12, విటమిన్‌బి6, విటమిన్ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పోలేట్ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.
4. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది.

7. ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి.
8. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.



Click it and Unblock the Notifications