2వభార్య పిల్లల బాగోగులు చూసుకోవడానికి 7 స్టెప్స్

By Lakshmi Perumalla

ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు కష్టతరమైన పని అంటే పిల్లల సంరక్షణ అని చెప్పవచ్చు. సాదారణంగా సవతి పిల్లల బాగోగులు చూడటం అనేక సవాళ్లతో కూడుకున్నది. సాదారణంగా పిల్లలు తప్పు చేస్తే నింద సవతి తల్లి మీద పడుతుంది. సవతి పిల్లల బాగోగుల విషయంలో సంపూర్ణ విజయం సాధించటం అనేది కష్టంగా ఉంటుంది. కానీ ఆ సవాళ్ళు ఒక రివార్డ్ వంటివి. మీ సవతి పిల్లలతో మీ బంధం అనేది మీ కొత్త భాగస్వామి బంధం కన్నా కీలకమైనది.

మీ కొత్త కుటుంబ సభ్యులతో ఒక సానుకూల సంబంధం అనేది మీ కుటుంబం యొక్క ఆనందం మరియు జీవితకాలానికి నిర్ణయించే కీలకమైన అంశం అని చెప్పవచ్చు. మీరు పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తే విజయం వస్తుంది. మీ సవతి పిల్లలను ట్రీట్ చేసే విధానంలో ఆశావాదం,సానుకూల వైఖరి,ప్రేమ మరియు రక్షణ ఉండాలి. మీరు నిజమైన మద్దతు ఇచ్చిన కారణంగా,ఒక ఆచరణీయ మరియు సమర్థవంతమైన విధంగా మీ సవతి పిల్లలు మీకు దగ్గర అవుతారు.

మీరు ఒక చిన్న ప్రణాళిక మరియు సన్నాహాలు కలిగి ఉంటే మీరు మీ కొత్త కుటుంబం మీద అధిక శాతం విజయం సాధించవచ్చు. ఇక్కడ సవతి పిల్లల బాగోగులను నిర్వహించడానికి సహాయపడే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రయత్నిస్తే మీ కొత్త కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది.

Looking After Step Children: Top 7 Tips

తగినంత సమయం గడపాలి

పిల్లలు ఎలా ఉన్నా సరే మీరు పిల్లలతో కొంత సమయం గడపటం ముఖ్యం. మీ సంభాషణ కోసం తగినంత సమయం మరియు మీ సంబంధాల నాణ్యతను మెరుగుపరచడానికి చాలా కీలకమైనది. మీ సవతి పిల్లల కోసం మీరు సమయాన్ని కేటాయించి వారి అభిరుచులు,ఇష్టాలు మరియు అయిష్టాలు గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.

మీరుగానే ఉండాలి

మరోవ్యక్తిగా వ్యవహరించడం అనేది సవతి పిల్లలు బాగోగుల కొరకు సహాయపడదు. మీకు విశ్వాసం ఉండాలి. అలాగే మీ సవతి పిల్లల మీద ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని గౌరవించే మార్గం ఏర్పడుతుంది. సవతి పిల్లలను నిర్వహించడంలో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే వారిని ఆకట్టుకోవటానికి గట్టిగా ప్రయత్నించకూడదు. సవతి పిల్లలు బాగోగుల విషయంలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ విధానం ఉండకూడదు.

కమ్యూనికేట్

కమ్యూనికేషన్ అనేది సవతి పిల్లలను నిర్వహించటానికి కీలక చిట్కాలలో ఒకటి.ఇది మీ సవతి పిల్లల అంచనాలను మరియు ఫిర్యాదులను తెలియజేస్తుంది. మీరు పరిస్థితిలో మార్పు అవసరమైనప్పుడు చర్యలను చేపట్టవచ్చు. సవతి పిల్లల బాగోగుల విషయంలో మీ వైఖరి మరియు కార్యక్రమాలలో పారదర్శకత ఉండాలి.

మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోండి

మీరు బలమైన కుటుంబ బంధాలను నిర్వహించడం కొరకు చొరవ తీసుకోవాలి. మీ సవతి పిల్లలకు మీ నుండి ప్రేమ మరియు శ్రద్ధ అవసరం అని గుర్తించాలి. మీ ప్రేమను వ్యక్తపరచటానికి వెనుకంజ వేయకూడదు. మీ సవతి పిల్లల నిర్వహణలో మీ భావాలను వ్యక్తీకరించడానికి ఈ చిట్కాలు ముఖ్యమైనవి.

పరిమితి అంచనాలు

నిజానికి సవతి పిల్లలకు మీతో సర్దుబాటు కోసం కొంత సమయం పడుతుంది. చాలా అంచనాలతో మీ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. కానీ మీ సవతి పిల్లల వ్యతిరేక ప్రభావం మిమ్మల్ని బాధకు గురి చేయవచ్చు. సవతి పిల్లలు బాగోగుల విషయంలో మీ అంచనాలను పరిమితం చేసుకోవాలని గుర్తుంచుకోండి.

వారి వయసును పరిగణించండి

సవతి పిల్లల వయస్సు విషయంలో మీ విధానంను సవరించండి.మీ సవతి పిల్లలు చిన్న పిల్లల నుండి వివిధ వయసుల వారు ఉండవచ్చు. వారి వయసుతో సరిపోయే విధంగా మీరు సవతి పిల్లలతో కమ్యూనికేట్ కు ప్రయత్నించండి. ఇది సవతి పిల్లలను నిర్వహించడంలో ముఖ్యమైన చిట్కాలలో ఒకటి.

ప్రొఫెషనల్ కౌన్సెలింగ్

తెలియని పిల్లలకు ఒక పేరెంట్ గా మారటం అనేది కష్టం మరియు సవాలుతో కూడుకున్నది. సవతి పిల్లలు బాగోగుల గురించి ముందుగానే నిపుణుల నుంచి సలహాలు తీసుకోవటం ఒక మంచి ఆలోచన. ఈ మీ ప్రయత్నం నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయం చేస్తుంది. సవతి పిల్లలను నిర్వహించడానికి ముఖ్యమైన చిట్కాలలో ఒకటిగా ఉంది.

Story first published: Tuesday, December 10, 2013, 23:42 [IST]
Desktop Bottom Promotion