Latest Updates
-
Chanakya Niti: చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే 8 పాఠాలు..టాలెంట్ ఉన్నా ఫెయిల్? -
జూన్ 3: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం, కెరీర్లో ఊహించని అద్భుతాలు! -
జూన్ 3న అద్భుత గ్రహ గతులు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, విజయం ఖాయం! -
గ్యాస్, ఎసిడిటీకి గుడ్ బై.. మీ జీర్ణక్రియను పెంచే సంజీవని పుదీనా కంజి వడ..ఎలా చేసుకోవాలంటే.. -
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ ఒక్క గీతా శ్లోకం.. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు -
కర్కాటకంలో గురుడి సంచారం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం, సంపద వెల్లువ! -
ధనుస్సు, మీన రాశుల వారికి అద్భుత యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 03 జూన్ 2026 -
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త
ఒంటరి కొడుకు తండ్రి సంరక్షణ: చిట్కాలు
ఒంటరిగా ఉన్న తండ్రుల సంఖ్య కొన్నిసంవత్సరాల క్రితం కంటే కుడా గణనీయంగా పెరిగిందని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఒంటరి తండ్రులలో గుర్తించబడిన కొన్ని లక్షణాలలో, వీరు సాధారణంగా ఒక అవివాహిత సహజీవన భాగస్వామిని కలిగి ఉండటం. మరో ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే వీరు, ఒంటరిగా తల్లుల కన్నా అధిక ఆదాయాలను కలిగి ఉండటం.
దురదృష్టకరమైన విషయమేమిటంటే, ఈ రకమైన పరిస్థితిలో విపరీతమైన బాధను పొందుతున్నది సంతానం. పిల్లలిని ఈ విడిపోవటం అనే గాయం ద్వారా చాలా బాధపడుతున్నారు మరియు వారు తండ్రితో ఉండవలసివొచ్చినప్పుడు, ఆ చిన్న శరీరం మరింత ఒత్తిడికి గురవుతున్నది. పిల్లలు పుట్టిన తర్వాత సహజంగానే తల్లికి ఆ పిల్లలతో బంధం ఏర్పడుతుంది. ఒక సంతోషకరమైన కుటుంబం, ఒక మంచి బాల్యం వంటివి మీరు, మీ బిడ్డను సంతోషంగా ఉంచటానికి ఇవ్వవలసిన కొన్ని విషయాలు.

కానీ, దురదృష్టవశాత్తు చాలా సందర్భాలలో, ఒంటరి సంరక్షణే పాత్ర వహిస్తున్నది మరియు ఒంటరిగా తండ్రి సంరక్షణ పిల్లలకి అవసరం అవుతున్నది. దీనికి గల కారణాలు అనేకం; మరణం, విడాకులు లేదా విడిగా ఉండటం! మీరు ఒకసారి రోజుక్రమంలో పడితే, మీ పిల్లలు మీతో సౌకర్యవంతంగా ఉంటారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రులారా! మీ పిల్లల మీద శ్రద్ధ వహించడానికి కొన్ని సంరక్షణ చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాము. చూడండి.
కమ్యూనికేట్
పిల్లలను తండ్రి సంరక్షిస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. మీరు మీ పిల్లల యొక్క సమస్యను ఓపిగ్గా వినడం చాలా అవసరం మరియు ఎలా సమస్యను పరిష్కరించాలో కుడా పిల్లలను అడగవలసిఉంటుంది. మీరు ఒక మంచి పరిష్కారం చూపిస్తాను భావిస్తే, అది మీ పిల్లలకు తెలియజేయండి. కమ్యూనికేషన్ కోసం మీరే ఓపెన్ గా ఉండటం దీనికి మూలం. #
వారికి ఎలా సమస్యలు పరిష్కరించాలో నేర్పండి
తండ్రుల సంరక్షణ చిట్కాలలో ఇది ఒకటి, వారితో కూర్చోండి మరియు వారితోనే ఆ సమస్యను పరిష్కరించేలా చేయండి. వారినే ఆ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అడగండి, ఒక పది ప్రత్యామ్నాయాలను తీసుకోండి, వాటిలో మీరు ఏది పరిష్కారనిర్ధారణకు వచ్చారో దానినే అమలు చేయండి. ఇలా చేయటానికి మీకు సహనం, ఓపిక అవసరం. దీనికి సమయం తీసుకుంటుంది కాబట్టి, మీరు కేవలం దీని మీద మనస్సు పెట్టి ఉండండి.
అతిగా వెనకేసుకు రావొద్దు
మీరు ఒంటరిగా పిల్లలను సంరక్షిస్తున్నప్పుడు చేసే ఒక సహజ చర్య. మీరు పిల్లలు సమస్యలు పరిష్కరించేందుకు పడుతున్న మానసికఒత్తిడిని చూడలేరు. మీరు మీ పిల్లలను అతిగా గారాబం, అతిరక్షణ చేయటం వలన వారిలో తిరుగుబాటు ధోరణి లేదా ఎక్కువగా మీ మీదే ఆధారపడటం జరుగుతుందని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు, ఈ రెండూ కూడా పిల్లలలో అనుకూలధోరణికి గుర్తులు కాదు.
పాలుపంచుకోండి
మీరు వారి జీవితాలలో సాధ్యమయినంతవరకు పాలుపంచుకోవటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన వారిపట్ల మీరు తీసుకునే శ్రద్ధ, శ్రమను అనుభూతి చెందుతారు మరియు మీరు వారిని వృద్ధిలోకి తీసుకురాగలరు. ఏ అవకాశాలైనా ఇద్దరూ కలిసి చేయటం వలన, ఈ మీ పిల్లలతో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. వారితో కలిసిమెలిసి ఉండండి, కానీ దూరంగా కూడా ఉంచండి, ఇలా చేయటం వలన వారిపట్ల మీకు నమ్మకం, ప్రేమ ఉన్నాయని అర్థం చేసుకుంటారు.
సపోర్ట్ గ్రూప్స్
ఇది కూడా పిల్లల సంరక్షణ కోసం చిట్కాలలో ఒకటి. మీరు మీ ఇరుగుపొరుగుతో కలిసి ఉండండి లేదా ఎక్కువగా ఒంటరిగా ఉన్న తండ్రులతో మాట్లాదండి. ఇలా చేయటం వలన మీరున్న పరిస్థితిలోనే ఉన్న తండ్రులను గురుంచి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరియు ఒకరిఒకరు సహాయం చేసుకోవొచ్చు. ఒంటరిగా ఉన్న తండ్రి పిల్లలను సంరక్షించటం అంటే అదేమీ సులభమైన పని కాదు. ఓపిగ్గా ఉండండి మరియు ప్రేమతో ఉండండి ; ఖచ్చితంగా మీదే విజయం.



Click it and Unblock the Notifications