Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
అనారోగ్యంతో ఉన్న పిల్లలు త్వరగా కోలుకోవడానికి పాటించాల్సిన టిప్స్..!!
మీకు పిల్లలు ఉంటే.. మీరు ఖచ్చితంగా మీ పిల్లలు సిక్ అయిన సంఘనటలు ఫేస్ చేసి ఉంటారు. తరచుగా.. సిక్ అవడం.. పిల్లల్లో చాలా సాధారణం. ఎప్పుడైతే పిల్లలు అనారోగ్యంగా ఉంటారో.. తల్లిదండ్రులకు పరీక్ష లాంటిది. పిల్లల అనారోగ్యాన్ని చూసి.. తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనకు లోనవుతూ ఉంటారు.
అనారోగ్యంగా ఉన్న పిల్లల సంరక్షణ కోసం ఎన్ని లీవ్స్ తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. ఎన్ని రోజులు గడపాల్సి వస్తుందో కూడా తెలియదు. ఎప్పుడైతే పిల్లలు అనారోగ్యం పాలు అవుతారో.. వాళ్ల స్కూల్ మిస్ అవుతారు, ఇతర యాక్టివిటీస్ మిస్ అవుతారు.
15 ఏళ్లలోపు పిల్లలు అనారోగ్యం పాలు అవడం చాలా సాధారణం. ఎందుకంటే.. వాళ్లు ఇమ్యునిటీ పూర్తీగా డెవలప్ అయి ఉండదు. అలాగే.. అనేక వ్యాధులతో పోరాడే శక్తి కలిగి ఉండదు. అందుకే పిల్లల్లో జలుబు, వైరల్ ఫీవర్, గొంతు ఇన్ఫెక్షన్స్, జీర్ణ సమస్యలు, గాయాలు వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
పిల్లలు సిక్ అయినప్పుడు.. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. చాలా జాగ్రత్తగా, కంటికి రెప్పలా చూసుకోవాలి. మరి పిల్లలు సిక్ అయినప్పుడు తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన బెస్ట్ టిప్స్..

రిలాక్సేషన్
పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. వాళ్లు మామూలు స్థితికి రావాలంటే కొన్ని రోజులు పడుతుంది. వాళ్లు రెగ్యులర్ రూల్స్ ఫాలో అవడం కష్టమవుతుంది. కాబట్టి.. మామూలుగా కంటే.. కొంచెం ఎక్కువ సమయం టీవీ చూడటానికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడైనే నిద్రపోయేలా జాగ్రత్తపడండి.

స్పెషల్ ఫుడ్
అనారోగ్యంతో ఉన్న పిల్లలకు స్పెషల్ డైట్ అవసరం. డాక్టర్ సలహా ప్రకారం ప్రత్యేక ఆహారాలను తయారు చేసి సమయానికి ఇవ్వండి.

మెడిసిన్ ట్రిక్స్
మెడిసిన్స్ తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. కాబట్టి.. వాళ్లకు తెలియకుండా.. ఆహారంలో గానీ, పాలలో గానీ కలిపి.. మెడిసిన్స్ వాళ్లకు అందేలా జాగ్రత్త పడండి.

నాలెడ్జ్
బుక్స్, ఇంటర్నెట్ చూసి.. అనారోగ్యంతో ఉన్న పిల్లలు త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలో చూసి నేర్చుకోండి. కొత్త టిప్స్ ఫాలో అవడం వల్ల.. వాళ్లు త్వరగా కోలుకుంటారు.

విశ్రాంతి
చాలా మంది తల్లిదండ్రులు స్కూల్ వర్క్ మిస్ అవుతుందని ఫీలవుతారు. దీంతో హెల్త్ బాగోలేకపోయినా.. రాసుకోమని ఒత్తిడి తీసుకొస్తారు. ఇది పిల్లల మూడ్ ని మరింత ఇబ్బంది పెడతుంది. కాబట్టి.. వాళ్లు.. కాస్త రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడం వల్ల.. త్వరగా కోలుకుంటారు.

పరిశుభ్రత పాటించేలా
చిన్న పిల్లలకు ఎలా శుభ్రంగా ఉండాలి, ముక్కులను ఎలా శుభ్రపరుచుకోవాలో తెలియదు. అలాగే టిష్యూస్ ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. కాబట్టి.. క్లీన్ ఉండటం గురించి వాళ్లకు సలహా ఇవ్వండి. హెల్తీగా ఉండటానికి శుభ్రత చాలా అవసరం.

ప్రేమ పంచడం
అనారోగ్యంతో ఉన్నప్పుడు పిల్లలైనా, పెద్దవాళ్లు అయినా.. వాళ్లకు ఇష్టమైనవాళ్లు ఎలా కేర్ తీసుకుంటున్నారు అనేది చూస్తారు. కాబట్టి.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పిల్లలకు చాలా సార్లు హగ్ ఇవ్వడం, కిస్ చేయడం వల్ల వాళ్లు.. చాలా రిలాక్స్ అవుతారు.



Click it and Unblock the Notifications
