Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పరీక్షల సమయంలో పిల్లల మైండ్ పవర్ పెంచే ఫుడ్స్ ఇవే.. ఇవి తింటే, చదివింది మర్చిపోరు!
దేశ వ్యాప్తంగా పరీక్షల సీజన్ మొదలైంది. స్కూల్, కాలేజ్‌లు ముగింపు దశకు వస్తుండడంతో పరీక్షలు మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి కూడా. త్వరలో పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ కూడా మొదలైపోతాయి. ఈ సమయంలో పిల్లలకు సరైన ఆహరం ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మరీ ముఖ్యంగా మెదడుకు మేలు చేసే ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఆహరం ఇవ్వడం వలన పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడి, పరీక్షల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా బాగా బలపడుతుంది. ఇంతకీ పరీక్షల సమయంలో పిల్లలకు ఏ విధమైన ఆహరం ఇవ్వాలి? వారికి ఏ విధంగా ప్రిపేర్ చేయించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాహారం
పిల్లల శరీరానికి సరైన పోషకాహారం ఇస్తే, వారు తమ ప్రిపరేషన్‌ను మరింత ప్రభావవంతంగా చేయగలుగుతారు. నేటి కాలంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, స్వీట్స్ అన్నీ ఎక్కువగా పిండి, చెక్కర పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి పిల్లల మెదడుకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా, వీటిని తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను అందించడం అవసరం.

నట్స్..
పిల్లల మెదడు సరిగ్గా పనిచేయడానికి సరైన పోషకాలతో కూడా ఆహరం అందించడం చాలా ముఖ్యం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు వాల్ నట్స్, చేపలు వంటి ఆహారాలు మెదడుకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి మాత్రమే కాదు, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను కూడా పెంచుతాయి. తద్వారా చదవడం మరియు గుర్తించడంలో పిల్లలకు సహాయం చేస్తాయి. అలాగే పిల్లలు చదివింది కూడా గుర్తుంచుకోవడానికి చాలా వరకు సహాయం చేస్తాయి. అందుకే వాటిని తినిపించడం వలన పరీక్షల్లో వారి సామర్థ్యం పెరగడంతో బాగా రాణించేందుకు అవకాశం కూడా ఉంటుంది.
ఐరన్ లోపం ఉంటే..
ఐరన్ లోపం వల్ల కూడా పిల్లలలో శ్రద్ధ తగ్గిపోతుంటుంది. కనుక వారికి ప్రతిరోజూ పాలకూర, పప్పులు, నట్స్ వంటి ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినిపించడం మంచిది. ఇలాంటి ఆహారపదార్థాలు తినిపించడం వలన వారిలోని ఐరన్ లోపం తగ్గిపోవడంతో పాటు వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత శక్తి అనేది పెరుగుతాయి. పరీక్షలకు సమృద్ధిగా ప్రిపేర్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
అవి హానికరం..
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు పిల్లల ఆరోగ్యానికి హానికరం. వాటి వల్ల మెదడుకు నష్టం వాటిల్లి, జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా, పరీక్షల సమయంలో ప్రాసెస్ చేసిన స్నాక్స్ మరియు పంచదారతో చేసిన ఆహారాలను తీసుకోవడం టాలెంటును తగ్గిస్తుంది. అలాగే వాటితో ఊబకాయం కూడా సంభవిస్తుంది.
ముఖ్యంగా, గుడ్లు, పాల ఉత్పత్తులు, కాయధాన్యాలు, మరియు లీన్ మాంసాలు పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్ వారికి ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ప్రోటీన్ లేకపోతే పిల్లలు సరైన రీతిలో చదవలేరు. అలాగే, పండ్లు, కూరగాయలు, ఆంటీ ఆక్సిడెంట్లను అందించే ఆహారాలు కూడా వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షణ కల్పిస్తాయి. సరైన ఆహారం ఇచ్చే ప్రాధాన్యతను తల్లిదండ్రులు ఎప్పుడూ మరువకూడదు. సరైన ఆహారమే సరైన నైపుణ్యానికి పునాది.



Click it and Unblock the Notifications