Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
శిశువుకు ప్రధాన ఆహారంగా ఏమి ఇవ్వాలి?

కనీసం ఒక సంవత్సరం వరకైనా తల్లి బిడ్డకు పాలను పట్టాలి. ఎప్పటికపుడు పోషకాహారం తాను తీసుకుంటూ బిడ్డకు పాలు సంవత్సరం వరకు అందిస్తే బిడ్డలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడి బిడ్డ తరచు అనారోగ్యంపాలు కాకుండా వుంటుంది. కొంతమంది స్త్రీలలో తల్లిపాలు సరిగా పడకపోవటంతో, పిల్లలకు ఆవు లేదా గేదె పాలు పడతారు. ఈ పాల కారణంగా బిడ్డలో కొవ్వు కణాల సంఖ్య కూడా పెరిగి బిడ్డ లావు అయ్యే అవకాశం వుంది. బిడ్డ మొదటి సంవత్సరంలో ఏర్పడే కొవ్వు కణాల సంఖ్య ఇక అతని జీవితాంతం శరీరంలో మెయిన్టెయిన్ అవుతూ లావుగానే వుండే సమస్య కూడా బిడ్డలు కలిగి వుంటారు.
పాలు సరిగా లేకుంటే పిల్లలకు బాటిల్స్ లో పట్టే పాలు వారి ఎదుగుదలను అరికడతాయి. పాలు సరిగా లేకపోవడం, లేదా పాలు తరచుగా మారుస్తూండటం, పాలను ఇచ్చే సమయాలు వివిధ రకాలుగా వుండటం వంటి తప్పిదాలు బాటిల్ పాలనిచ్చే పిల్లలకు ఊబకాయం తెప్పిస్తాయంటున్నారు పరిశోధకులు. అదే రకంగా, తగినన్ని పాలు తీసుకోని పిల్లలు పోషకాహార లేమి కలిగి వుంటారు.13000 మంది తల్లుల అలవాట్లను పరిశీలిస్తే బాటిల్ ఫీడింగ్ పై వారికి సరిఅయిన అవగాహన లేకపోవడం సమస్యకు కారణంగా పరిశోధకులు తెలిపినట్లు ది డైలీ ఎక్స్ ప్రెస్ వార్తాపత్రిక ప్రచురించింది.
కొత్తగా తల్లులైనవారు బాటిల్ ఫీడింగ్ చేయటంలో విఫలులని, లేదా తాము తమ పాలు ఇవ్వటంలో విఫలమయ్యామన్న భావనతో కూడా బిడ్డకు సరి అయిన సమయాల్లో బాటిల్ ఫీడింగ్ చేయటంలేదని కూడా పరిశోధకులు భావించారు. పిల్లలకు పాలు పట్టే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ తల్లులు కాబోతున్న మహిళలకు సరి అయిన అవగాహన కలిగించే సమాచారాన్నివ్వాలని, తల్లులు అయిన తర్వాత, వారు పాలు పట్టలేమని తెలిసిన తర్వాత మహిళలు బాటిల్ ఫీడింగ్ అంశాన్ని అవలంబించటంలో విఫలులవుతున్నారని కూడా పరిశోధకులు భావించారు.



Click it and Unblock the Notifications
