Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డ బరువును నిర్ణయించే తల్లిపాలు!

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైరల్ ఇన్‌ఫెక్షన్స్, అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి. దీనితో శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే మరోమారు ప్రెగ్నెన్నీకూడా రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూ లంగా తల్లిలో అప్పటికే వదులైన గర్భాశయం తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.
మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి.7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల వారికి ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్ వెనక్కి ఉంటే పుట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్ చుట్టూ శు భ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.
తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాలను తినిపించడం మంచిది. బిడ్డకు ప్రతి రెండు, మూడు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే ప్రతి నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాల సమయమైనా పాలివ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే పదినుండి పదిహేను నిమిషాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.



Click it and Unblock the Notifications