Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పసి పిల్లలకు పాలు పడితే స్తనాలు మెత్తబడుతాయా.... ?

చిన్నారులు ఎలాంటి జబ్బులతో ఉన్నా తల్లిపాలు పట్టాలి. పాలసీసాలు, పాల పీకలు ఎప్పటికీ వాడకం అంత మంచిది కాదు. 6వ నెలలో ఇంటిలో తయారు చేసిన అదనపు ఆహారం ఇవ్వడం మొదులు పెట్టాలి. అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు కనీసం రెండు సంవత్సరాల పట్టాలి. తల్లీ బిడ్డకు ఇష్టమైతే, రెండ సంవత్సరం తర్వాత ఎంత కాలమైనా తల్లిపాలు పట్టవచ్చు. తల్లి పాల సంస్కతి వల్ల తల్లుల్లో గర్భాధారణ వాయిదా ప్రకృతి సిద్దంగా జరగుతుంది. తల్లిపాలు పట్టడం వల్ల తల్లులలో ప్రసవానం తర రక్తస్రావం అరికట్టవచ్చు. మహిళల్లో స్తనాల కేన్సర్, అండాశయ కేన్సర్, ఆస్టియో పోరోసిస్ జబ్బులు నివారించవచ్చు. తల్లిపాలు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం...
కొత్తగా తల్లులయ్యే మహిళలకు బిడ్డలకు పాలు ఇవ్వటంలో ఎన్నో సందేహాలుంటాయి. పాలు పడితే తమ స్తన సౌందర్యం పోతుందని, మరోమారు పూర్వపు ఆకారాన్ని పటుత్వాన్ని స్తనాలు సంతరించుకోలేవని, పాలు పట్టినందువలన బాగా సాగిపోయి వేలాడతాయని భావిస్తూ వుంటారు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. కనుక మొదటగా పాలుపట్టే తల్లి తన స్తనాలు సాగిపోయే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ లేదని గ్రహించాలి. పాలు పట్టినందువలన రొమ్ములు మరోమారు పూర్వపు ఆకారాన్ని త్వరగా పొందే అవకాశం ఉంటుంది. ఈ చర్య ఆమెలోని కొవ్వును కరిగిస్తుంది. గర్భాశయం పూర్వపు రూపు సంతరించుకోవడానికి అవసరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
రొమ్ము సైజును బట్టి పాలు తయారవుతాయని చాలా మంది భావిస్తారు. కాని పాలగ్రంధుల పరిమాణాన్ని బట్టి పాలు తయారవుతాయని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ కారణంగా బిడ్డకు తల్లి పాలు పట్టకుండా వుండకూడదు. బిడ్డకు జలుబు చేసిందని, దగ్గువస్తోందని తల్లులు తమ పాలను నిలిపేస్తారు. కాని ఇది సరికాదు. తల్లి తీవ్రంగా జబ్బు పడితే తప్ప, బిడ్డకు పాలు పట్టటం ఆపరాదు. తల్లి ఏదేని తీవ్ర జబ్బుపడితే ఆమెలోని రోగక్రిములు పాల ద్వారా బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. పాలు పడితే స్తనాలు మెత్తబడిపోతాయనేది మహిళలల్లో ఉంటుంది. మెత్తబడినా అది తాత్కాలికంగా జరిగే ప్రక్రియ అని బిడ్డ సరిగా పాలు తాగుతుంటే మరోమారు పాలు ఇవ్వటం ఆగిన వెంటనే మహిళ కొద్దిపాటి వ్యాయామాలతో తన స్తనాల సౌందర్యం కాపాడుకోవచ్చునని గ్రహించాలి.



Click it and Unblock the Notifications