Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శిశువు బరువు తక్కువగా వుంటే?

పిల్లలు తక్కువ బరువుతో పుట్టటానికి గల కారణాలు
1. తల్లికి రక్తహీనత లేదా, అధిక రక్తపోటు ఉన్నపుడు శిశువు బరువు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
2. మన జనాభా ప్రత్యేకంగా పల్లెల్లో ఆడవారి బరువు అత్యంత తక్కువగా అంటే 30 నుండి 40 కేజీలు మాత్రమే ఉంటోంది. ఆరోగ్యవంతంగా పిల్లలు పుట్టాలంటే కనీసం ఆడవారి బరువు 45 కేజీలకు మించి ఉండాలి.
3. గర్భం దాల్చినప్పటినుండీ ప్రసవం అయ్యేవరకూ తల్లి షుమారు 10 కేజీలు పెరగాలి. కానీ మన దేశంలో 5 లేదా 6 కేజీలే పెరుగుతున్నారు. ఇది తిండిలోపంవల్ల అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
4. మొదటి కాన్పులోనే ఎక్కువగా బరువు తక్కువున్న శిశువులు జన్మిస్తున్నారు.
5. గర్భిణీలు గర్భం దాల్చిన తరువాత వైద్యుడిని సంప్రదించి సరైన సలహా లేదా వైద్య సహాయం పొందడం లేదు.
6. పల్లెలో ఆర్థిక కారణాలచేత, బరువు తక్కువగా ఉన్నవారిలో తక్కువ బరువున్న శిశువులు జన్మిస్తున్నారు.
7. మన అలవాట్లు కూడా శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. తాగుడు, సిగరెట్లు, గుట్కా, పొగాకు నమలడం అనేవి దుర్వ్యసనాలు పిల్లల ఎదుగుదల తగ్గుతుంది.
8. శ్రమ చేసేవారిలో విశ్రాంతి దొరకనపుడు పిల్లలు నెలలు నిండకముందే పుడతారు. లేక తొమ్మిది నెలలకు పుట్టినా బరువు తక్కువుంటారు. గర్భంతో ఉన్నపుడు విశ్రాంతి అవసరం. మధ్యాహ్నం రెండు గంటలు, రాత్రి 8 గంటలు నిద్ర తప్పనిసరి. అలాగే సరైన ఆహారం కూడా చాలా అవసరం.
9. ఐరన్, ఫోలిక్‌యాసిడ్ మాత్రలు మొదటి మూడు నెలలు మహిళ తప్పక వేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ మాత్రలు ఇస్తున్నా చాలామంది వేసుకోవడం లేదు. పాప పెరగడానికి ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం.



Click it and Unblock the Notifications