Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ప్రసవంతర్వాత బాడీని స్లిమ్ గా మార్చేలెమన్ వాటర్
సాధారణంగా మహిళలల్లో గర్భం ధరించిన తర్వాత అనేక ఆలోచనలు మొదలవుతాయి. ఆహారం నుండి, వారి జీవనశైలివరకూ ఎలా ఉండాలని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్నలెన్నో వారి మనస్సులో మెదులుతాయి. వీటితో పాటు వారి ఆరోగ్యపరిస్థిల మీద కూడా ఎక్కువ శ్రధ్దపెరుగుతుంది. ప్రీనేటల్ మొదలకుని, పోస్ట్ నేటల్ వరకూ మహిళ మనస్సులో ‘డెలివారీ తర్వాత తిరిగి స్లిమ్ గా 'తయారవ్వడం ఎలా? ఇది ప్రతి గర్భిణీ స్త్రీ మనస్సులో ఏర్పడే సాధరణ ప్రశ్న. ప్రముఖ సెలబ్రెటీ కిమ్ కర్ధాషియన్ కూడా తల్లైన తర్వాత తన మునపటి ఫిగర్ కోసం, స్లిమ్ అవ్వడం కోసం అవసరమయ్యే మార్గాలన్నింటినీ అనుసరిస్తోంది.
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత సులభమైన పని కాదు, ప్రసవం తర్వాత కూడా కొంత మంది మహిళలు గర్భిణీగానే కనిపిస్తుంటారు. అందుకు కారణం గర్భధారణ సమయంలో యూట్రస్ విస్తరించబడి ఉంటుంది. అది తిరగి యథాస్థితికి, నార్మల్ షేప్ మరియు సైజ్ కు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా హార్మోన్లు మరియు డైట్లో మార్పులు కూడా మిమ్మల్ని ఫ్యాట్ గా కనబడేలా చేస్తుంది . అందువల్ల, పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొంచెం కష్టం అవుతుంది, అయితే, మీ పోస్ట్ నేటల్ డైట్ లో కొన్ని వెయిట్ లాస్ ఫుడ్స్ : నిమ్మవంటివి చేర్చుకోవడం ద్వారా అవి గొప్పగా సహాయపడుతాయి . పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ డైట్ చాలా సింపుల్ గా ఉంటుంది. మరి ఈ సిట్రస్ ఫ్రూట్ మీరు ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి...

లెమన్ జ్యూస్ : ఆరోగ్యకరమైన ద్రవాలు అంటే నిమ్మరసం వంటివి తీసుకోవడం మంచిది. ఇవి పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . అయితే నిమ్మజ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తీసుకోవడం మంచిది. మంచి ఆరోగ్యానికి మరియు కొవ్వు కరిగించడానికి పంచదారకు బదులు తేనెను మిక్స్ చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్న చేయడానికి నిమ్మ మరియు తేనె చాలా అద్భుతంగా సహాయపడుతాయి . ప్రసవం తర్వత, మహిళ ప్రతి రోజూ ఉదయం నిమ్మ మరియు తేనె మిశ్రమాన్ని తీసుకోవచ్చు. తాగాజా తయారుచేసిన తేనె మరియు నిమ్మజ్యూస్ ను కాలీ కడుపుతో ఒక గ్లాసు తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి, కడుపును క్లీన్ గా ఉంచుతంది.
గోరువెచ్చని లెమన్ వాటర్: మీరు తప్పకుండా రోజంతా వేడినీళ్ళు త్రాగడానికి ప్రయత్నించండి . హాట్ వాటర్ లో బరువు తగ్గించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత, వెంటనే నీళ్ళు త్రాగకండి. మీకు దప్పికగా ఉన్నప్పుడు, కొద్దిగా తీసుకోవచ్చు. అరగంట లేదా గంట తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళు త్రాగాలి . మరింత మంచి ఫలితాలు పొందాలంటే అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోండి . పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొరకు ప్రతి రోజూ మూడు గ్లాసుల లెమన్ వాటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
లెమన్ డ్రెస్సింగ్: సలాడ్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన వంటలు మీ పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చండి. సలాడ్స్ డ్రెస్సింగ్ నిజంగా కొవ్వును కరిగిస్తాయి . కాబట్టి పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొరకు మీ సలాడ్స్ లో నిమ్మరసాన్ని జోడించండి.



Click it and Unblock the Notifications











